newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. జూలై 31 వరకూ స్కూల్స్ బంద్

27-06-202027-06-2020 07:40:42 IST
Updated On 27-06-2020 11:23:09 ISTUpdated On 27-06-20202020-06-27T02:10:42.786Z27-06-2020 2020-06-27T02:10:36.810Z - 2020-06-27T05:53:09.064Z - 27-06-2020

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. జూలై 31 వరకూ స్కూల్స్ బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశరాజధాని ఢిల్లీ కరోనా వైరస్ తో వణికిపోతోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77240కి చేరుకున్నాయి. కోలుకుని డిశ్చార్జ్ అయినవారు 47091గా నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఢిల్లీలో మరణించినవారి సంఖ్య 2492కి చేరింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీలో 3,390 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ముంబైని మించిపోయింది.

ముంబైలో ఏప్రిల్‌ నెలలో విపరీతంగా కేసులు నమోదైతే , ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నాళ్లుగా ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేసుల తీవ్రత దృష్ట్యా ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించడం, శానిటైజ్ చేయడం చేస్తున్నారు. మరోవైపు పాఠశాలలు, కాలేజీలు తెరిచే అవకాశం లేదు. కరోనా వైరస్ నుంచి రక్షణకు ఢిల్లీ వాసుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను మూడు రెట్లు పెంచామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించిన ఆయ‌న‌.. ఢిల్లీలో కరోనా కారణంగా చికిత్స పొందుతున్న వారిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

అకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ 90 నుండి 85 శాతానికి పడిపోతున్నా.. 94 శాతం కంటే ఆక్సిజన్ స్థాయి తగ్గడం ప్రమాదకరం అన్నారు. అటువంటివారు లవెంటనే వైద్యులను సంప్రదించాల‌ని సూచించారు.. అవసరమయిన వారికి ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా ఆక్సిజన్ ఇంటికి సరఫరా చేస్తుంద‌ని వెల్ల‌డించారు సీఎం.  ప్లాస్మా థెరపీ చికిత్స కోసం ఎల్.ఎన్.జే.పి మరియు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు అనుమతి ఇచ్చామ‌ని తెలిపారు ఢిల్లీ సీఎం... అయితే, సీరియస్‌గా ఉన్న కరోనా రోగులకు  ప్లాస్మా థెరపీ పనిచేయ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. అందరూ  ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌న్నారు. ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణై.. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆక్సిజన్ అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామ‌న్నారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విద్యా సంవత్సరం ఇప్పటికే ఆలస్యమైంది. పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. కొన్ని పరీక్షలను ఏకంగా రద్దు చేశారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్ననేపథ్యంలో  ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జులై 31 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించినట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు.  జూలై 1వ తేది నుంచి ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కావాలి. కానీ నెలరోజుల పాటు వాయిదా వేశారు. విద్యార్ధుల తల్లితండ్రుల అభ్యర్ధన, ఆందోళన, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సిలబస్‌ను 50 శాతం తగ్గించి.. విడతల వారీగా పదో తరగతి క్లాసులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇటు ఏపీ, తెలంగాణల్లో జూలై చివరిలో గానీ ఆగస్టు నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు అధికారులు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle