ఢిల్లీ ఫైట్ 2020: ఆప్ హ్యాట్రిక్ విజయం @62 సీట్లు
11-02-202011-02-2020 17:35:47 IST
Updated On 11-02-2020 18:22:02 ISTUpdated On 11-02-20202020-02-11T12:05:47.476Z11-02-2020 2020-02-11T12:05:43.072Z - 2020-02-11T12:52:02.934Z - 11-02-2020

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ వార్ వన్ సైడ్ గా ముగిసింది. బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఆప్ మళ్ళీ అఖండ విజయాన్ని తనఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 2015లో ఆప్ 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా తేడా ఏంలేదు. అంతా సేమ్ టు సేమ్. ఫలితాల సరళిలో రెండంకెల స్థానాలు లభిస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆశ నెరవేరలేదు. ఫలితాలు ఏకపక్షంగా వెలువడ్డాయి. ఢిల్లీ పీఠం తమదే అని కాన్పిడెన్స్ తో చెప్పినా అది నిజం కాలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ చరిత్ర గతమే. గతంలో దివంగత షీలా దీక్షిత్ మూడుసార్లు కాంగ్రెస్ కి అధికారం తెచ్చిపెట్టారు. కానీ ఈసారి కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయిది. కౌంటింగ్ ప్రారంభంలో ఒక సీటు వస్తుందని భావించినా రాలేదు. 20 స్థానాల్లో నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్ లో 7 స్థానాలకే బీజేపీ పరిమితం అయింది. ఫలితాలు వెలువడడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలోనూ కేజ్రీవాల్ ప్రేమికుల రోజు ప్రమాణం చేయగా.. ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించిన కేజ్రీవాల్ ను పలువురు ప్రముఖులు అభినందించారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా