newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీ పోలీసులను తప్పుపట్టిన జడ్జి ఆకస్మిక బదిలీ

27-02-202027-02-2020 16:21:57 IST
2020-02-27T10:51:57.468Z27-02-2020 2020-02-27T10:51:55.098Z - - 14-04-2021

ఢిల్లీ పోలీసులను తప్పుపట్టిన జడ్జి ఆకస్మిక బదిలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లను అదుపు చేయడంలో పోలీసుల నిష్క్రియపై ధ్వజమెత్తిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్‌న్ అర్థరాత్రి ఉన్నపళంగా బదలీ చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలపై నిశిత విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

జస్టిస్ ఎస్ మురళీధరన్‌ని బదిలీ చేయాలంటూ గతంలో అంటే 2018 డిసెంబరు, 2019 జనవరిల్లో కేంద్రం చేసిన సిఫారసును అప్పటి సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తిరస్కరించారు. కానీ ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ సాగుతున్న దశలో బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. వాదనలు జరిగిన కొద్ది గంటలకే బదిలీ ఉత్తర్వులు వెలువడడాన్ని న్యాయవాదులు ప్రశ్నించారు. ఇది న్యాయ వ్యవస్థకే తీరనిలోటని ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ ఖండించింది.

ఢిల్లీ అల్లర్లపై హర్ష్‌ మందర్‌ అనే సామాజికవేత్త దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటాక, మళ్లీ బుధవారంనాడు రెండు దఫాలు హైకోర్టు అత్యవసరంగా స్పందించి- నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. దేశ రాజధానిలో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్ల నాటి పరిస్థితిని పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఢిల్లీని మరో 1984 కానివ్వం..  ఈ కోర్టు కావలిలో, ఈ పోలీసుల నిఘాలో ఉన్నంతకాలం ఆనాటి పరిస్థితులు రానివ్వం. అందరం పూర్తి అప్రమత్తంగా ఉండాలి’’ అని పేర్కొంది. 

బుధవారం కూడా హైకోర్టు ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్య ధోరణిపై విరుచుకుపడింది. అల్లర్లలో గాయపడ్డవారిని చిన్నచిన్న ఆసుపత్రుల నుంచి జీటీబీ, ఎల్‌ఎన్‌జేపీ లాంటి పెద్దాసుపత్రులకు పంపే పరిస్థితులు లేవని, సురక్షితంగా బాధితులను చేర్చేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తొలుత సరూర్‌ మందర్‌ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టును అర్థించారు. వెంటనే జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌, జస్టిస్‌ అనూప్‌ బంభానీలతో కూడిన బెంచ్‌ ఏర్పాటైంది. 

ఆ వెనువెంటనే  రాత్రి ఒంటిగంట సమయంలో పోలీసు ఉన్నతాధికారులను ఉన్నపళంగా జస్టిస్‌ మురళీధర్‌ నివాసానికి రావలిసిందిగా బెంచ్ కబురుపెట్టింది. వారు రాగానే- బాధితులను తక్షణం ఆసుపత్రులకు, ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. 

షహీన్ బాగ్ నిరసనకారులను రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై సాగిన విచారణలో వారిని ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. కొన్ని వీడియోక్లి్ప్పింగులు చూశామని, కపిల్ మిశ్రా ప్రసంగ వీడియో చూడలేదని కోర్టు హాల్లో ఉన్న పోలీసు అధికారి చెప్పగానే జస్టిస్ మురళీధర్ మండిపడ్డారు.

‘మీ ఆఫీసులో చాలా టీవీలున్నాయిగా.. అన్ని చానెళ్లూ కపిల్‌ మిశ్రా ప్రసంగాన్ని టెలికాస్ట్‌ చేశాయి. అది కూడా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలో చేసిన ప్రసంగం. ఢిల్లీ పోలీసు వ్యవస్థలో పరిస్థితులు ఇలా ఉన్నాయన్న మాట దిగ్ర్భాంతి కలిగిస్తోంది’’ అని జస్టిస్‌ మురళీధర్‌ తీవ్రంగా మందలించారు. కపిల్‌ మిశ్రా ప్రసంగ పాఠాన్ని కూడా బెంచ్‌ సొలిసిటర్‌ జనరల్‌కు అందజేసి ‘ఇకనైనా మీ పోలీస్‌ కమిషనర్‌కు సలహా ఇవ్వండి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చెప్పండి’ అని వ్యాఖ్యానించింది.

కపిల్‌ మిశ్రా సహా బీజేపీ నేతలు చేసిన ద్వేషపూరిత ప్రసంగాల గురించి కోర్టు ప్రశ్నించింది. తెలియదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పగా జస్టిస్‌ మురళీధర్‌, జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘దేశం మొత్తానికి తెలిసిన ఆ వీడియోల వ్యవహారం పోలీసులకు తెలియదా? మేమే ప్రదర్శిస్తాం చూడండి’’ అని 4 వీడియో క్లిప్పింగులను కోర్టు హాలులో చూపారు.

కాగా, అర్థరాత్రి జస్టిస్ మురళీధర్ బదిలీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రభస మొదలైంది. కేంద్రప్రభుత్వం న్యాయమూర్తులను కూడా ఉపేక్షించడం లేదని, న్యాయవ్యవస్తపై ప్రజల నమ్మకాన్ని ఇలాంటి ఆకస్మిక బదిలీలు పూర్తిగా పోగొడతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. కోట్లాది మంది ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల ఇంకా ఉన్న నమ్మకాన్ని ప్రభుత్వ చర్య వమ్ము చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు.

అయితే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 12-02-2020న చేసిన సిఫార్సుల ప్రకారమే జస్టిస్ మురళీధర్‌ బదిలీ జరిగిందని, ఈ బదిలీ విషయంలో న్యాయమూర్తి అనుమతి కూడా తీసుకున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. సాధారణ క్రమంలో జరిగే బదిలీని కూడా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు.

చదవండి : ఢిల్లీ అల్లర్ల కారకులపై హైకోర్టు, సుప్రీం కోర్టు మండిపాటు

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle