ఢిల్లీ కోటలో పాగా బీజేపీకి కలేనా?
08-02-202008-02-2020 08:30:22 IST
2020-02-08T03:00:22.072Z08-02-2020 2020-02-08T02:59:49.052Z - - 12-04-2021

బీజేపీ, ఆప్ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు అగ్నిపరీక్షే. ఇవాళ పోలింగ్ ప్రారంభమయింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆప్, బీజేపీ భావిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎన్నికలను ప్లాన్ చేసుకున్నాయి. 70 అసెంబ్లీ నియోజక వర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 13,750 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందులో 13శాతం ముస్లింలు ఉన్నారు. వీరు ఎవరికి ఓటేస్తారనేది కీలకంగా మారింది. చాందిని చౌక్ నియోజక వర్గంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఈసారి కాంగ్రెస్ అంత యాక్టివ్ గా ఈ ఎన్నికల్లో కనిపించలేదు. దీంతో ఈ ఓట్లు ఎవరకి పడతాయో చూడాలి. 1998 నుంచి 2008 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ తరువాత ఆ పార్టీ పూర్తిగా బలహీనమైపోయింది. షీలా దీక్షిత్ తరువాత ఆ పార్టీని ఢిల్లీ మరొకరు నడిపించలేకపోయారు. ఆప్ ఈసారి కూడా అధికారంలోకి రావాలని చూస్తోంది. అవకాశం ఇవ్వడానికి మాత్రం బీజేపీ సిద్ధంగా లేదు. ఇప్పటికే ఆప్ కు రెండుసార్లు అధికారం కట్టబెట్టారు. 2013లో జరిగిన ఎన్నికల్లో అక్కడ హంగ్ ఏర్పడింది. బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా,కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అధికారంలోకి వచ్చింది. అలా వచ్చిన 49 రోజుల్లోనే కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్ళీ 2015 లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆప్ 67 చోట్ల విజయం సాధించింది. ఇది చరిత్రలోనే భారీ మెజారిటీ అని చెప్పాలి. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. బీజేపీ మూడు చోట్ల విజయం సాధించింది. ఢిల్లీని ఎలాగైనా సాధించాలని బీజేపీ పట్టుదలగా వుంది. కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించిందని, ఆప్ కు సహకరించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. బీజేపీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకొని అంతర్గతంగా ఆప్ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో సిఏఏ కు వ్యతిరేకంగా ముస్లింలు, మరికొంతమంది రగడ చేస్తున్నారు. ఇది బీజేపీకి మైనస్ అవుతుందని అంటున్నారు. బీజేపీకి ఢిల్లీ పీఠం కలగా మిగులుతుందని ఆప్ అంటోంది. సర్వేలు కూడా ఆప్ వైపే మొగ్గుచూపుతున్నాయి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
13 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
16 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
14 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
11 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా