newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీ ఆరోగ్యమంత్రికి సీరియస్.. ప్లాస్మా థెరపీకి అవకాశం

20-06-202020-06-2020 19:00:52 IST
2020-06-20T13:30:52.072Z20-06-2020 2020-06-20T13:30:37.012Z - - 20-04-2021

ఢిల్లీ ఆరోగ్యమంత్రికి సీరియస్.. ప్లాస్మా థెరపీకి అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పాజిటివ్ తో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ పెరగడంతో.. వైద్యులు ఆయనకు ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స కొనసాగిస్తున్నారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో జూన్‌ 15న సత్యేంద్ర జైన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనుకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో ఆయనను పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉంచారు. 

సత్యేంద్ర జైన్‌ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తగిన చికిత్సను అందించాలని వైద్యులను కోరారు. అలాగే కరోనా నుంచి జైన్‌ వెంటనే కోలుకోవాలని  అమిత్‌ షా ఆకాంక్షించారు. గత ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌లతో కలిసి సత్యేంద్రజైన్‌ హాజరయ్యారు.

దీంతో ఆ సమావేశంలో పాల్గొన్నవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సత్యేంద్ర జైన్‌ఆస్పత్రిలో చేరడంతో.. ఆరోగ్య శాఖతోపాటు ఆయన నిర్వహించే అన్ని శాఖల బాధ్యతలను తాత్కాలికంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు అప్పగించారు.  తొలుత ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయితే శుక్రవారం సాయంత్రం ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు గుర్తించడంలో మాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మాక్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

కర్నాటకలోని ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం మూసివేశారు.కర్ణాటక సీఎం అధికారిక నివాసంలో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్‌ భర్తకు వైరస్‌ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం మూసివేసి శానిటైజ్‌ చేశారు. సీఎం అధికారిక కార్యక్రమాలను విధానసౌధకు మార్చుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను క్వారంటైన్‌కు తరలించారు.  ఇటు తెలంగాణలో బీఆర్కెఆర్ భవన్ లోనూ కరోనా అలజడి రేపుతోంది. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle