newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీ అల్లర్ల దోషులను ఎవరినీ వదలం.. అమిత్ షా

13-03-202013-03-2020 10:22:52 IST
2020-03-13T04:52:52.957Z13-03-2020 2020-03-13T04:52:51.027Z - - 14-04-2021

 ఢిల్లీ అల్లర్ల దోషులను ఎవరినీ వదలం.. అమిత్ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక నేపథ్యంలో రెండు వారాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆకస్మిక అల్లర్ల బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. భవిష్యత్తులో అల్లర్లకు పాల్పడేవారికి ఒక గుణపాఠంలా తమ చర్యలుంటాయన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటినేమాత్రం పట్టించుకోమని, అల్లర్లలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. ఆ అల్లర్లు ముందుగానే ప్లాన్‌ చేసుకున్న కుట్ర అని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. ఈ ఢిల్లీ హింసాకాండకు సంబంధించి పోలీసులు 2,647 మందిని అదుపులోకి తీసుకున్నారని, దాదాపు 700 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారని, ఈ హింసకు ఉపయోగించిన 152 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, ఆయుధాల చట్టం కింద 49 కేసులు నమోదు చేశారని అమిత్‌ షా వివరించారు. 

ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీసీ టీవీ ఫుటేజ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ మతం ఆధారంగానో, దుస్తుల ఆధారంగానో వివక్ష చూపదని విపక్షంపై విసుర్లు విసిరారు. హోళీ సమయంలో మత కలహాలు జరగకుండా చూసేందుకే.. ఆ పండుగ తరువాత ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావించిందన్నారు. 

‘ఢిల్లీ హింసాకాండలో మొత్తం 52 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. విపక్షం తరహాలో నేను వారిలో హిందువులెందరు? ముస్లింలు ఎందరు? అనే వివరాలను ఇవ్వదలచుకోలేదు. 526 మంది గాయపడ్డారు. 371 మంది భారతీయుల దుకాణాలు, 142 మంది ఇండియన్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి’ అని వివరించారు. 

కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ పేరును ప్రస్తావించకుండా.. ‘ఫిబ్రవరి 24న ఒక విపక్ష నేత ఇది అటో ఇటో తేల్చుకునే యుద్ధం అని రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఇది విద్వేష ప్రసంగం కాదా?’ అని షా ప్రశ్నించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంఐఎం నేత వారిస్‌ పఠాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను  ప్రస్తావించారు. సీఏఏను సమర్ధిస్తూ.. మతం ప్రాతిపదికన 25కి పైగా చట్టాలను రూపొందించారని, సీఏఏ ఏ మతంపైనా వివక్ష చూపదని పునరుద్ఘాటించారు.

అమిత్‌ మాట్లాడుతుండగానే.. నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు, చర్చలో పాల్గొన్న పలువురు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహించి, మంత్రి పదవికి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చర్చను కాంగ్రెస్‌ సభ్యుడు ఆధిర్‌ రంజన్‌ చౌధురి ప్రారంభించారు. ‘ఈ హింసాకాండలో హిందువులు గెలిచారని కొందరు, ముస్లింలు గెలిచారని కొందరు చెబుతున్నారు. నిజానికి మానవత్వం ఓడిపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ హింసాకాండకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. హిందూత్వ విద్వేషమనే సునామీ వచ్చిందన్నారు. దేశ ఆత్మని కాపాడాలని ఓవైసీ హిందువులను కోరారు. దాదాపు 1,100 మంది ముస్లింలను అక్రమంగా నిర్బంధించారన్నారు. 

ఢిల్లీ అల్లర్లను మత కలహాలనడం హాస్యాస్పదం. ఇవి ముందే ప్లాన్‌ చేసుకున్న ఊచకోత’ అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ‘ఫైజాన్‌ ముస్లిం అయినంత మాత్రాన ఆయన ప్రాణం విలువ అంకిత్‌ ప్రాణం విలువ కన్నా తక్కువ కాబోదు. మొత్తం హింసాకాండపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి’ అని ఆయన కోరారు. అల్లర్ల సమయంలో ముస్లింలకు సాయం చేసిన సిక్కులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle