ఢిల్లీ అల్లర్ల కారకులపై హైకోర్టు, సుప్రీం కోర్టు మండిపాటు
27-02-202027-02-2020 14:27:17 IST
2020-02-27T08:57:17.335Z27-02-2020 2020-02-27T08:57:14.689Z - - 22-04-2021

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు 67 రోజులపాటు ప్రశాంతంగా కొనసాగిన షహీన్ బాగ్ నిరసన ప్రదర్శనల నేఫథ్యంలో ఈశాన్య ఢిల్లీలో ఉన్నట్లుండి చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనల నేపథ్యంలో రెచ్చగొట్టేలా ప్రసంగించిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఇందిరాగాంధీ హత్య సందర్భంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన హింసాకాండను ఈ దేశంలో పునరావృతం అయ్యేందుకు అనుమతించబోమని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పించాలని ఆదేశించింది. అల్లర్లలో ఐబీ అధికారి మృతి చెందడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీలో తలెత్తిన హింస నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రతిస్పందించిన తీరుని ఢిల్లీ హైకోర్టు ప్రశంసించింది. ‘మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్. మురళీధర్ వ్యాఖ్యానించారు. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని సూచించింది. బాధితులు, వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది జుబేదా బేగంని నియమించింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలనీ జస్టిస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ బెంచ్ ఆదేశించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగం వీడియోని చూశారా అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పోలీస్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) రాజేష్ డియోలను కోర్టు ప్రశ్నించింది. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్‌ని తాను చూడలేదనీ తుషార్ మెహతా జవాబిచ్చారు. అనంతరం కోర్టులో బీజేపీ నేతల వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు. కాగా, హింసను సకాలంలో గుర్తించడంలో, విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ నిర్లక్ష్యం 20కి పైగా పౌరుల మరణానికి దారి తీసిందని పోలీసులను ధర్మాసనం మందలించింది. హింస చెలరేగిన సందర్భంలో ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా చట్టబద్దంగా వ్యవహరించాలని పోలీసులకు హితబోధ చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చదవండి : ఢిల్లీలో ఆగని అల్లర్లు.. 20 మంది మృతి.. 200 మందికి గాయాలు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
8 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
11 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
15 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా