newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీ అల్లర్లపై చార్జిషీట్‌లో సీతారాం ఏచూరి.. అరెస్టు తప్పదా?

13-09-202013-09-2020 07:40:58 IST
2020-09-13T02:10:58.469Z13-09-2020 2020-09-13T02:10:50.355Z - - 12-04-2021

ఢిల్లీ అల్లర్లపై చార్జిషీట్‌లో సీతారాం ఏచూరి.. అరెస్టు తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కస్టడీలోకి తీసుకున్న విద్యార్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా డిల్లీ పోలీసులు అనూహ్య చర్యకు పాల్పడ్డారు. ఆరునెలల క్రితం ఢిల్లీ నగరంలో పౌరసత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల సందర్భగా చోటు చేసుకున్న హింసాకాండకు ప్రేరేపించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ప్రముఖ రాజకీయ నేతలు, ప్రొఫెసర్లు, చిత్ర నిర్మాతలపై నేరారోపణ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం  చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. 

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు,14న ప్రారంభం కానున్న తరుణంలో  ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్  ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. 

ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. 

జయాతీ ఘోష్, అపర్వానంద్, మార్గదర్శకత్వంలోనే తాము 2020 ఫిబ్రవరి 22న దేశరాజధాని జఫ్రాబాద్‌లో జరిగిన రోడ్ రోకో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నామని కస్టడీలో ఉన్న విద్యార్థి నాయకులు కలితా, నర్వాల్  రాతపూర్వక ఇచ్చిన ప్రకటన ఆధారంగా పోలీసులు ఈ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. తాము పోలీసులు అందించిన షీట్‌పై సంతకం చేయమని  ఈ విద్యార్థి నాయకులు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినప్పటికీ పోలీసులు వారి ప్రకటననే హోంమంత్రి అమిత్ షాకు సమర్పించడం గమనార్హం.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా  జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle