newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ఢిల్లీ అల్లర్లకు పోలీసుల అసమర్థతే కారణమా..

26-02-202026-02-2020 09:44:46 IST
2020-02-26T04:14:46.689Z26-02-2020 2020-02-26T04:14:41.583Z - - 07-12-2021

ఢిల్లీ అల్లర్లకు పోలీసుల అసమర్థతే కారణమా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత ముూడురోజులుగా ఢిల్లీలో చెలరేగిన ఆకస్మిక అల్లర్లు ఎవరిని వేలెత్తి చూపుతున్నాయో చెప్పడం కష్టంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణమే ఈశాన్య డిల్లీలో అల్లర్లు చెలరేగి 13 మంది మరణించడం, 150 మంది గాయపడటం వెనుక కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు కుట్ర దాగి ఉందా డిసెంబర్ 15 నుంచి ఢిల్లీలోని షాహిన్ బాగ్‌లో మహిళలు, పిల్లలు పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా జరుపుతున్న చారిత్రాత్మక ప్రదర్శన ఇంతవరకు దాదాపు శాంతియుతంగానే కొనసాగుతూ దేశ దృష్టినే కాకుండా ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రచారం షాహిన్ బాగ్ చుట్టూ తిరిగినా, కొందరు నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సామాజిక వాతావరణం అంతగా దెబ్బతినలేదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో పర్యటించిన సమయంలోనే అల్లర్లు జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా శనివారంనాడు జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో సిఏఏకు వ్యతిరేకంగా కొందరు నిరసన ప్రదర్శనలు ప్రారంభిస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చోవడమే ఈ పరిణామాలకు దారితీసిందని చెబుతున్నారు. బహుశా ట్రంప్ దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల తీవ్రత పెంచాలని, తమ ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని వారు భావించి ఉంటారు. ఆ తర్వాత కొన్ని రాళ్లు రువ్వుడు ఘటనలు జరగడం, ఆదివారం బిజెపి నేత కపిల్ మిశ్రా రంగ ప్రవేశం చేయడం జరిగాయి. 

ఈ శిబిరాన్ని మూడు రోజుల్లో ఎత్తి వేయకపోతే పోలీసుల మాట కూడా విననని ఆయన హెచ్చరించేందుకు ఎవరు ప్రోద్బలం కలిగించారు ఢిల్లీ ఎన్నికల ప్రచార సమయంలో కపిల్ మిశ్రా చేసిన ‘గోలీ మారో’ వంటి వ్యాఖ్యలను తాను ఆమోదించబోనని హోంమంత్రి అమిత్ షా ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రకటించిన తర్వాత కూడా కపిల్ యధావిధిగా ఎందుకు వ్యవహరించారు ట్రంప్ భారత్ నుంచి వెళ్లిపోగానే ప్రదర్శనా శిబిరాలను ఎత్తివేస్తామని ఆయన ఎందుకు ప్రకటించారు ఘర్షణల్లో ఒక కానిస్టేబుల్‌తో పాటు అనేకమంది మరణించడానికి ఎవరు కారణం కేవలం స్థానికుల మధ్య ఘర్షణ జరిగిందా లేక బయటనుంచి వ్యక్తులు ప్రవేశించారా

షాహిన్‌బాగ్‌లో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తన చేతుల్లోకి సుప్రీంకోర్టు తీసుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఈ అల్లర్లు ఎందుకు ప్రారంభమయ్యాయి రోడ్డుకు అడ్డంగా నిరసన ప్రదర్శన చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు షాహిన్‌బాగ్ ప్రదర్శనకారులతో చర్చలు కూడా ప్రారంభించింది. సుప్రీంకోర్టు తరఫున సీనియర్ న్యాయవాదులు సాధనా రామచంద్రన్, సంజయ్ హెగ్డే చర్చలు కూడా జరిపి తమ అభిప్రాయాలను సీల్డ్ కవర్‌లో న్యాయమూర్తులకు సమర్పించారు. పరిస్థితి యధాతథంగా మారుతుందని అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఢిల్లీలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో ఘర్షణలు మొదలయి హింసాకాండ ప్రజ్వరిల్లింది.

జామియా, జెఎన్‌యు వంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీకాలం గత జనవరిలో పూర్తయినప్పటికీ మరో నెలపాటు ఎందుకు పొడిగించారు 1984లో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన తర్వాత ఢిల్లీలో ఇంతటి తీవ్రమైన ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఘర్షణలకు పాల్పడేవారంతా ఒకే చోట చేరి తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేందుకు పోలీసులు వీలు కల్పించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

CAA supporters destroy the protest site used by those opposing it in New Delhi. Police on Monday imposed an emergency law prohibiting any gatherings in the violence-hit areas. [Danish Siddiqui/Reuters]

ఒక అగ్రదేశాధినేత మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పోలీసులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారు ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఈ ఘటనల గురించి సమాచారం ఇచ్చినప్పటికీ వారెందుకు చర్యలు తీసుకోలేదు కొత్తగా నిరసన ప్రదర్శనలను ఎందుకు అనుమతించారు అనుమానిత వ్యక్తుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు నిషేధాజ్ఞలు విధించడం, డ్రోన్‌లను ఉపయోగించడం వంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఈ మొత్తం ఘర్షణల్లో పోలీసుల అసమర్థత స్పష్టంగా కనిపిస్తోంది.

జఫ్రాబాద్, మౌజ్ పూర్ ప్రాంతాల్లో పోలీసులు నిశ్చేష్టగా నిలుచుండగా జనం రాళ్లు విసురుకోవడం, తుపాకుల వంటి మారణాయుధాలను కూడా చేతబూనడం, వాహనాలు, టైర్ల ఫ్యాక్టరీలు దగ్ధం చేయడం, పెట్రోల్ బాంబులతో ఇళ్లపై దాడులు చేయడంవంటి ఘటనలు జరిగాయి. ఆఖరుకు దృశ్యాలు రికార్డు చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు, కెమెరాలు లాక్కోవడం, వారిపై భౌతికంగా కూడా దాడులు చేయడం జరిగింది. 

ట్రంప్, మోదీ వివిధ ఒప్పందాలపై సంతకాలు చేస్తున్న హైదరాబాద్ హౌజ్‌కు సమీపంలోనే ఘర్షణలు జరగడం, వాటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వ్యాప్తి కావడం వారి సమర్థతను శంకించేలా చేస్తుంది. ఇది కేవలం పోలీసుల సమర్థతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది దేశంలో ఉన్న పాలనా వ్యవస్థ పనితీరును కూడా ప్రతిబింబిస్తుంది.

షాహిన్ బాగ్ నిరనసప్రదర్శనలు రెండు నెలలకు పైగా అనుమతించిన ప్రభుత్వం అటో ఇటో తేల్చుకోవాలనే తలంపుతో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈశాన్య డిల్లీలో అల్లర్లను తెరవెనుకనుంచి ప్రోత్సహించిందా అనే అనుమానాలను ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ఎంతో అవసరం. 

భారత పర్యటనలో అడుగడుగునా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రదర్శించిన పారదర్శకతో, సమస్యలను స్పష్టంగా బహిరంగంగా చర్చించడం వంటి పరిణితి చెందిన పాలనా లక్షణాన్ని భారత ప్రధాని అవలంబించకుండా, మీడియాతో మాట్లాడకుండా తెరవెనుక చర్యలకు పరిమితం కావడమే సమస్యలను తెగేదాకా లాగే పరిస్థితికి కారణమవుతోందా అనేది తేలాల్సి ఉంది. 

 

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   4 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   7 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   9 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   20 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   21 hours ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   04-12-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle