newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీలో హై అలెర్ట్ .. సైబర్, ఉగ్రదాడులకు అవకాశం

22-06-202022-06-2020 11:16:23 IST
Updated On 22-06-2020 12:14:53 ISTUpdated On 22-06-20202020-06-22T05:46:23.045Z22-06-2020 2020-06-22T05:43:15.323Z - 2020-06-22T06:44:53.930Z - 22-06-2020

ఢిల్లీలో హై అలెర్ట్ .. సైబర్, ఉగ్రదాడులకు అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశరాజధానిలో ఒక వైపు కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. మరోవైపు ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి నిఘావర్గాలు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ప్రధాన రహదారులపై తనిఖీలు ముమ్మరం చేశారు. నలుగురు ,ఐదుగురు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుంచి ట్రక్ లో ఢిల్లీ చేరుకున్నట్లు నిఘావర్గాలకు ఖచ్చితమయిన సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

వీరితో పాటు మరికొందరు ఢిల్లీలో రావడానికి  రోడ్డు మార్గంలో బస్సు, కారు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలకు అందిన సమాచారంతో హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. దీనికి తోడు కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో నేటి నుంచి అతి పెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు జాగ్రతలు తెలిపింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీలకు, అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ అటెండ్ చేయవద్దని పేర్కొంది. 

హ్యాకర్లు ncov2019@gov.in వంటి ఈ-మెయిల్స్‌ను వినియోగిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడతారని సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.  భారతీయ కంప్యూటర్, అత్యవసర స్పందన సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కరోనాకు సంబంధించిన విషయాలను చూపుతూ, మభ్యపెడుతూ దేశంలోని వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది. కరోనా బాధితులకు సహాయం చేస్తామని మీ వివరాలు తమకు అందించాలని సైబర్ నేరగాళ్ళు మీ వ్యక్తిగత అకౌంట్లు, సోషల్ మీడియా ఖాతాల గురించి వివరాలు సేకరించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ సంస్థలు, విభాగాల పేరిట హ్యాకర్లు దేశంలో ఫిషింగ్‌ దాడులకు దిగే అవకాశముందని, మీకు ప్రభుత్వం సాయం చేయడానికి రెడీ ఉందని వారు తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ ఈ-మెయిల్స్‌ పంపే అవకాశముందని చెప్పింది. ఇటువంటి ఈ-మెయిల్స్‌ వస్తే వాటిని క్లిక్‌ చేయొద్దని చెప్పింది. హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచిత కరోనా పరీక్షల పేరుతో లక్షలాది మందికి ఈ-మెయిల్స్‌ పంపాలని హ్యాకర్లు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపింది. తెలిసిన వ్యక్తుల పేరిట వచ్చిన మెయిల్స్‌లోని యూఆర్ఎల్‌లను కూడా క్లిక్‌ చేయొద్దని హెచ్చరించింది. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు యాంటీ వైరస్‌ టూల్స్‌ వంటి సేవలు వాడాలని పేర్కొంది. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   14 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle