newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీలో పెరిగిన చలి.. ఎన్నికల వేడి

24-01-202024-01-2020 09:17:40 IST
Updated On 24-01-2020 11:41:45 ISTUpdated On 24-01-20202020-01-24T03:47:40.687Z24-01-2020 2020-01-24T03:40:48.966Z - 2020-01-24T06:11:45.476Z - 24-01-2020

ఢిల్లీలో పెరిగిన చలి.. ఎన్నికల వేడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని మురికివాడలు మినహా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి కనిపిస్తుంటుంది. ఎన్నికల ప్రచారంలో ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఇండియా వర్సస్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్‌ మిశ్రా చేసిన కామెంట్లు వివాదం రేపుతున్నాయి.

వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే హిందూత్వ ఎజెండా, మోదీ క్రేజ్‌తోనే బీజేపీ ఎన్నికల గోదాలో దిగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన సుపరిపాలననే నమ్ముకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపి పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది.  అయిదేళ్లలో తన పనితీరు నచ్చితేనే మరోసారి ఓటు వేయండి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఓటర్లకి విజ్ఞప్తి చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.

అంతేకాదు కొన్ని తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారు కేజ్రీవాల్. నెలకి 20 కిలో లీటర్ల కంటే తక్కువ వాడుకున్న వారికి ఉచితంగా నీరు, 32 శాతం వరకు తగ్గిన విద్యుత్‌ ధరలు, స్కూలు ఫీజుల్ని పెంచకపోవడం, ఆమ్‌ ఆద్మీ మొహల్లా క్లినిక్ ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటివి మళ్లీ గెలిపిస్తాయని ఆప్ భావిస్తోంది.

లోక్‌సభ బీజేపీకి, శాసనసభ ఆప్‌కి అన్న పోస్టర్లు రాజధాని వీధుల్లో కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా కేజ్రీవాల్‌ హుందాగా ప్రచారం చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి కొత్త ముఖాలకి టిక్కెట్లు ఇచ్చి కేజ్రీవాల్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

కాంగ్రెస్ పార్టీకి మాత్రం నాయకత్వ లేమి బాగా కనిపిస్తోంది. ఇదే లోటు అంటున్నారంతా. 1998 నుంచి 2013వరకూ కాంగ్రెస్ తన సత్తా చాటింది. అయితే ఆప్ రాకతో కాంగ్రెస్ ప్రభ కోల్పోయింది. మళ్లీ పూర్వ వైభవం కోసం ఆపార్టీనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో విమానలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచు కారణంగా విమానాలను దారిమళ్ళిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా తగ్గాయి. ఆరేడు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు పెరగడం లేదు.  ఈప్రభావం ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle