newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీలో కలకలం.. ఆప్ ఎమ్మెల్యేపై దుండగుడి కాల్పులు

12-02-202012-02-2020 08:50:03 IST
2020-02-12T03:20:03.821Z12-02-2020 2020-02-12T03:19:22.958Z - - 14-04-2021

ఢిల్లీలో కలకలం.. ఆప్ ఎమ్మెల్యేపై దుండగుడి కాల్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 70 సీట్లలో 62 స్థానాలు చేజిక్కుంచుకుంది. ఈసంబరాల్లో ఉన్న వేళ ఓ దుండగుడి చర్య కలకలం రేపింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు దిగడంతో అంతా కలవరపడ్డారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఈ దాడి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఆ దుండగుడిని గుర్తించి పట్టుకోవాలి’’అని ఆయన అన్నారు. 

తాజా ఎన్నికల్లో నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరగటం ఢిల్లీలో చర్చనీయం అంశంగా మారింది.  దుండగుడు ఎవరు, నరేష్ కి అతనికి ఏమైనా శత్రుత్వం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది.

ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ  ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ దాడిలో మరణించింది ఆప్ కార్యకర్త అశోక్ మన్ అని గుర్తించారు.

ఎమ్మెల్యేపై దాడికి దిగిన నిందితున్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ విషయంపై ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. సీఏఏ విషయంలో రోజుకో ఆందోళన జరుగుతున్న సమయంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   28 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   a few seconds ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle