newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఢిల్లీలో ఆగని అల్లర్లు.. 20 మంది మృతి.. 200 మందికి గాయాలు

26-02-202026-02-2020 16:11:13 IST
Updated On 26-02-2020 16:13:23 ISTUpdated On 26-02-20202020-02-26T10:41:13.193Z26-02-2020 2020-02-26T10:41:08.178Z - 2020-02-26T10:43:23.155Z - 26-02-2020

ఢిల్లీలో ఆగని అల్లర్లు.. 20 మంది మృతి.. 200 మందికి గాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య  ఉన్నట్లుండి చెలరేగిన హింసాత్మక ఘర్షణలు మంగళవారం రాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో రెండురోజుల తర్వాత కూడా ఇంకా పరిస్థితి అదుపులోని రాలేదు, ఆందోళనకారులు షాపులకు, బైక్‌లకు నిప్పు పెట్టారు. ఢిల్లీలోని మౌజ్‌పుర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ అందోళనల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ సహా 20 మంది మృతి చెందారు. ఘర్షణల్లో 50 మంది పోలీసులతో సహా 200 మందికి పైగా గాయపడ్డారు.

తుపాకీ కాల్పుల్లోనే 70 మంది గాయపడ్డారని సమాచారం. దీంతో పోలీసులు యమునా విహార్‌లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారుల దాడిలో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. అధికారులు డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 35 కంపెనీల పారామిలటరీ దళాలను మోహరించారు. స్పెషల్‌ సెల్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సహా ఆర్థిక నేరాల విభాగం అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిసర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఈశాన్య ఢిల్లీలో మోహరించారు. భద్రతా ఏర్పాట్లను వెయ్య మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు సోషల్‌ మీడియా పుకార్లపై ప్రత్యేక మానిటరింగ్‌ చేపట్టారు. 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో యథేచ్ఛగా అల్లర్లు కొనసాగాయి. అల్లరిమూకలను చెదరగొట్టే క్రమంలో తలకు గాయమై హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ ప్రాణాలు కోల్పోగా, షాహ్‌దరా డీసీపీ అమిత్‌ శర్మ గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. హింసకు దిగిన అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి లాఠీచార్జి చేశారు. అనేక ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ను విధించారు.  మౌజ్‌పూర్‌, భజన్‌పురా, చాంద్‌బాగ్‌ ప్రాంతాల్లో అనేక షాపులు, ఇళ్లు, ఒక పెట్రోల్‌ పంప్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. 

ఇదిలావుండగా, అదనపు బలగాలను తరలించి, శాంతిభద్రతలను పునరుద్ధరించాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆయన చెప్పారు. అల్లర్లను అదుపు చేయాల్సిందిగా బైజాల్‌ ఢిల్లీ పొలీసు కమిషనర్‌ను ఆదేశించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం పరామర్శించారు. ఈ అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీలోని జీటీబీ, మాక్స్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అల్లర్లలో గాయపడిన బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘ఈ ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలో ఎవరు గాయపడకుండా తప్పించుకోలేదు. హిందువులు, ముస్లింలు, పోలీసులు అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’ అని సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అల్లర్లకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి కిషన్‌రెడ్డి సోమవారం హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలను ఆమోదిస్తామనీ, హింసను సహించేది లేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో హింసకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘షాహీన్‌బాగ్‌ వద్ద శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయించలేదు. ఒకవేళ హింస చెలరేగితే కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు.

సీఏఏకు నిరసనగా జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వెలుపల ఒక రోడ్డుకు అడ్డంగా మహిళలు శనివారం రాత్రి బైఠాయించారు. దీనిపై ఆదివారం రాత్రి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఆందోళనకారులు అనేక ప్రాంతాల్లో బైఠాయించడం ప్రారంభించారు. ఈ దశలో బీజేపీ నేత కపిల్‌ మిశ్రా రంగంలోకి దిగి నిరసనకారులను ఖాళీ చేయించాల్సిందిగా కోరడంతో పరిస్థితి అదుపు తప్పింది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఢిల్లీలో అడుగుపెట్టిన రోజే అల్లర్లు జరగడం వెనుక ఒక కుట్ర ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌ వద్ద చాలా రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులు సోమవారం ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనుక సీఏఏ వివాదాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లే వ్యూహం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ట్రంప్‌ ఢిల్లీకి వచ్చిన రోజునే అల్లర్లను రెచ్చగొట్టడం ద్వారా ఆయన దృష్టిని ఆకర్షించి విస్తృత ప్రచారం పొందాలన్న వ్యూహం కనిపిస్తోంది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి సైన్యాన్ని పిలిపించబోమని చెప్పారు. తగినంత మంది కేంద్ర పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులు పరిస్థితి అదుపులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఈశాన్య ఢిల్లీ పొడవునా 6,000 మంది పోలీసులను, పారా మిలటరీ బలగాలను నియమించినట్లు తెలిపారు. ఒక్కొక్క కంపెనీలో 70 మంది నుంచి 100 వరకు ఉండే 67 కంపెనీల బలగాలను ఈశాన్య ఢిల్లీలో నియమించారు. తగినంత సంఖ్యలో బలగాలు లేవన్నవార్తలు అసత్యాలని, సీనియర్ పోలీసు అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని, హోమంత్రిత్వ శాఖ మాకు మద్దతుగా నిలబడిందని ఢిల్లీ పోలీసు చీఫ్ అమూల్య పట్నాయిక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పోలీసులు చాంద్ బాగ్ ప్రాంతంలో అల్లర్లను అపడానికి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

అయితే పైనుంచి ఆదేశాలు రానిదే ఢిల్లీ పోలీసు బలగాలు ఏమీ చేయలేవని, అమిత్ షాతో ఈ విషయం మంగళవారం ఉదయమే చర్చించానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. హోంశాఖ నుంచి ఆదేశాలు రానిదే పోలీసు టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జి కూడా చేయలేరని కేజ్రీవాల్ వివరించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టగానే ఈశాన్య డిల్లీలో అల్లర్లు చెలరేగడం వెనుక దేశాన్ని, కేంద్రప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర దాగి ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్ని మూసివేశారు. ఈ ప్రాంతంలోని అయిదారు కీలక స్టేషన్లలో ఢిల్లీ మెట్రో తన సర్వీసులను నిలిపి వేసింది. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   21 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle