newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

డీకే అరెస్టుతో బీజేపీకి వారంతా దూర‌మైన‌ట్లేనా..?

12-09-201912-09-2019 15:14:48 IST
2019-09-12T09:44:48.860Z12-09-2019 2019-09-12T09:43:59.198Z - - 15-09-2019

డీకే అరెస్టుతో బీజేపీకి వారంతా దూర‌మైన‌ట్లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో డీకే శివ‌కుమార్ కీల‌క‌మైన వ్యక్తి. ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిప‌క్షంలో ఉన్నా డీకే నిత్యం వార్తల్లో ఉండే కీలకనేత. త‌న రాజ‌కీయ వ్యూహాలు, దూకుడు స్వ‌భావంతో జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న ట్రబుల్‌ షూట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల అత్యంత విశ్వాసంగా ఉండే డీకే ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్నారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.

దీంతో కాంగ్రెస్ శ్రేణులు, శివ‌కుమార్ అనుచ‌రులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగారు. వీటిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోకున్నా బుధ‌వారం బెంగ‌ళూరు న‌గ‌రంలో డీకే మ‌ద్దతుదారులు జ‌రిపిన భారీ ర్యాలీ మాత్రం చ‌ర్చనీయాంశ‌మైంది. వేలాదిగా ఆయ‌న మ‌ద్దతుదారులు, అంత‌కుమించి డీకే శివ‌కుమార్ స్వంత ఒక్కలిగ వ‌ర్గ ప్ర‌జ‌లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీకి ప‌ట్టున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ జ‌రిగింది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కలిగులు ఈ ర్యాలీ చేప‌ట్టారు. ఒక్క‌లిగ సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌ను బీజేపీ కావాలనే అణిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నేది వారి ఆరోప‌ణ‌.

క‌ర్ణాట‌క‌లో ఒక్కలిగ సామాజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు 11 శాతం ఉన్నారు. ముఖ్యంగా ద‌క్షిణ క‌ర్ణాట‌క‌లో వీరి జ‌నాభా ఎక్కువ‌. ఈ సామాజ‌క‌వ‌ర్గానికి ఇప్పటివ‌ర‌కు మాజీ ప్రధాని దేవెగౌడ పెద్దదిక్కుగా ఉండేవారు. త‌ర్వాత కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఎదిగిన డీకే శివ‌కుమార్ ఉన్నారు. వీరిద్దరినే ఈ సామాజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు త‌మ నేత‌లుగా భావిస్తుంటారు. ఇప్పుడు శివ‌కుమార్‌ను అరెస్టు చేయ‌డాన్ని వారు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ర్యాలీ జ‌రిగింది.

ఇటీవ‌లి పార్లమెంటు ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో రెండుసీట్లు త‌ప్ప మిగ‌తా అన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఒక స్థానంలో డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేష్‌, మ‌రో స్థానంలో దేవెగౌడ మ‌న‌వ‌డు ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ విజ‌యం సాధించారు. వీరి విజ‌యానికి కూడా ఒక్కలిగ సామాజ‌క‌వ‌ర్గం ఏక‌ప‌క్షంగా వీరికి మ‌ద్ద‌తు ఇవ్వడ‌మే కార‌ణం. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో మ‌రో ప్రధాన సామాజ‌క‌వ‌ర్గమైన లింగాయ‌త్‌లు బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉంటారు. ప్రస్తుతం ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప స్వంత సామాజ‌క‌వ‌ర్గ‌మైన వీరి జ‌న‌భా క‌ర్ణాట‌క‌లో 14 శాతం.

దీంతో ఇప్పుడు ఒక్క‌లిగ సామాజ‌క‌వ‌ర్గానికి కూడా ద‌గ్గ‌రై జేడీఎస్‌కు, డీకే శివ‌కుమార్‌కు చెక్ పెట్టాల‌ని బీజేపీ భావిస్తోంది. అందుకే ముగ్గురు డిప్యూటీ సీఎం ప‌ద‌వుల్లో ఒకటి లింగాయ‌త్‌కు, ఒకటి ఒక్క‌లిగ వ‌ర్గానికి, ఒకటి దళిత నేత‌కు ఇచ్చారు. ఇంత‌లోనే డీకే శివ‌కుమార్ అరెస్టుతో బీజేపీ ఆశించిన‌ట్లుగా ఒక్క‌లిగులు ద‌గ్గ‌ర‌వ‌క‌పోగా దూర‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక్క‌లిగ వ‌ర్గంలో డీకేకు ఉన్న ప‌ట్టును సైతం గుర్తించిన బీజేపీ ఇది క‌క‌క్ష‌సాధింపు కాద‌ని చెబుతోంది. అందుకే ఆయ‌న త్వ‌ర‌గా ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని స్వ‌యంగా య‌డియూర‌ప్ప కోరుకున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle