డిజిటల్ వైపే కేంద్రం అడుగులు..కాలెండర్లు, గ్రీటింగ్ కార్డులు బంద్
04-09-202004-09-2020 08:20:59 IST
Updated On 04-09-2020 11:13:08 ISTUpdated On 04-09-20202020-09-04T02:50:59.161Z04-09-2020 2020-09-04T02:26:34.717Z - 2020-09-04T05:43:08.318Z - 04-09-2020

మోడీ ప్రభుత్వం అంటేనే అంతా డిజిటల్. నోట్ల రద్దు దగ్గర్నించి అంతా డిజిటల్ మయం అవుతోంది. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ఆదేశాలతో రాబోయే 2021 కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదు. డిజిటలైజేషన్ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేపర్ మిగలడమే కాదు కోట్లాదిరూపాయలు పొదుపు చేయవచ్చు. కరోనా కారణంగా వీటి ముద్రణ. పంపిణీ వల్ల కలిగే ఇబ్బందులకు అవకాశం ఉండదని కేంద్రం భావిస్తోంది.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
3 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
a day ago
ఇంకా