newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డికె శివకుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

14-09-201914-09-2019 18:28:21 IST
2019-09-14T12:58:21.417Z14-09-2019 2019-09-14T12:57:40.898Z - - 14-04-2021

 డికె శివకుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక రాజకీయాలలో చక్రం తిప్పుతూ వచ్చిన శివకుమార్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా ఉన్నారు.మనీ ల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌ను ఈ నెల 17 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) కస్టడీకి పంపుతూ ఢిల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

శివకుమార్‌ను డాక్టర్‌ వద్దకు తీసుకు వెళ్లాలని, ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇ.డి. అధికారులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈడీ అధికారులు డికె శివకుమార్ తో పాటు ఆయన కూతురు ఐశ్వర్యను ప్రశ్నలమీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.  

శివకుమార్ కూతురు ఐశ్వర్యను కూడా విచారించామని ఇడి తెలిపింది. అయితే సరైన సమాధానాలు లభించడం లేదని పేర్కొంది. కూతురు ఐశ్వర్యను ఈడీ ఆఫీసులోనే చూడడంతోనే శివకుమార్ కుప్పకూలిపోయారు. లెక్కకు మించిన ఆస్తుల కేసులో ఐశ్వర్యను ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించారు.

అక్రమ ఆస్తుల సేకరణ, ఢిల్లీ నివాసం నుంచి లెక్కకు తేలని నిధుల స్వాధీనం కేసుకు సంబంధించి శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండువారాల కింద విచారణకు ఢిల్లీ రప్పించి, అదుపులోకి తీసుకుంది. తొమ్మిదిరోజులుగా వంద గంటలకు పైగా ఆయనను ఇడి అధికారులు విచారించారు. 20 దేశాల్లో 386 అకౌంట్లతో పెద్దఎత్తున నిధులు అక్రమంగా దాచారని కోర్టు దృష్టికి ఇడి అధికారులు తీసుకెళ్లారు. 

తన సోదరుడిని వేధించేందుకు ఇడి అధికారులు తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేశారని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎంపి డికె సురేష్‌ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. డీకె శివకుమార్ అక్రమార్జన రూ.200 కోట్లు, బినామీ ఆస్తి రూ.800 కోట్లు అని ఢిల్లీ కోర్టుకు ఇడి అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిసింది. తమ ప్రశ్నలకు శివకుమార్ సరైన విధంగా సహకరించడం లేదని, మధ్యమధ్యలో విశ్రాంతి కావాలని సమయం వృధా చేస్తున్నారని ఈడీ పేర్కొంది. అయిదు రోజుల కస్టడీలో కూడా ఆయన ఏమీ చెప్పరని కోర్టు అభిప్రాయపడింది. శివకుమార్‌ నడుపుతున్న ట్రస్టు, ఆస్తులు, కోట్ల రూపాయల వ్యాపారాల వెనుక ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నట్లు ఈడీ అధికారి తెలిపారు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle