newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

డికె శివకుమార్ అరెస్ట్...కాంగ్రెస్ క్యాడర్ ఫైర్

05-09-201905-09-2019 12:59:53 IST
Updated On 05-09-2019 15:29:39 ISTUpdated On 05-09-20192019-09-05T07:29:53.016Z05-09-2019 2019-09-05T07:29:51.541Z - 2019-09-05T09:59:39.324Z - 05-09-2019

డికె శివకుమార్ అరెస్ట్...కాంగ్రెస్ క్యాడర్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ అయి, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ట్రబుల్‌ షూటర్‌ డికె శివకుమార్‌ అరెస్ట్ వ్యవహారం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. డికె శివకుమార్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. తమ నేత అరెస్ట్‌ ను నిరసిస్తూ కర్ణాటక బంద్‌ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. 

బీజేపీ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. డీకే అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే అని ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

డికె అరెస్టుతో రగిలిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు. బంద్‌ రాష్ర్టంలో విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పోలీసులు ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప నివాసం వద్ద భద్రతను మరింత పటిష్టపరిచారు. కాంగ్రెస్‌ పట్టు ఉన్న జిల్లాల్లోని బిజెపి కార్యాలయాల వద్ద కూడా భద్రతను పెంచారు. బుధవారం 

రాష్ట్ర బంద్ నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు పిలుపునిచ్చారు. 

ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, గత ప్రభుత్వం మంత్రిగా కొనసాగిన శివకుమార్ అరెస్టుతో ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బుధవారం కూడా ఆందోళనలను కొనసాగించనున్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల రద్దుతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle