newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డాక్టర్ల ఆచూకీ లభ్యం... అసలేం జరిగింది?

03-01-202003-01-2020 10:16:38 IST
2020-01-03T04:46:38.008Z03-01-2020 2020-01-03T04:46:31.661Z - - 17-04-2021

డాక్టర్ల ఆచూకీ లభ్యం... అసలేం జరిగింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీలో కలకలం రేపిన ఇద్దరు తెలుగు  డాక్టర్లు హిమబిందు, దిలీప్ ల అదృశ్యం కేసు కొలిక్కి వచ్చింది. సిక్కింలో ఈ డాక్టర్ల ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. డాక్టర్‌ దిలీప్‌ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో వీరున్న ప్రాంతాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరి మిస్సింగ్ మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. 

శ్రీధర్‌, దిలీప్‌, హిమబిందు ముగ్గురు ఎంబీబీఎస్‌లో క్లాస్‌మేట్స్‌. అలాగే ఆత్మీయ మిత్రులు. శ్రీధర్‌ అతని భార్య హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. దిలీప్ ఛండీగఢ్‌లో ఉంటున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దిలీప్‌ను ట్రైన్ ఎక్కించేందుకు హిమబిందు డిసెంబర్ 25న రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కంగారుపడ్డ  శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

శ్రీధర్‌ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వారి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు ఫోన్లు సిచ్ఛాఫ్‌ రావడం.. వారిద్దరు రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి. చివరికి సోషల్‌మీడియా సాయంతో వారిద్దరు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించిన పోలీసులు వారికి అప్పగించనున్నారు. ఇటు చంఢీగడ్‌లో ఉంటున్న దిలీప్‌ భార్య దివ్య భర్త ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంది. 

వారం రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు, అసలేం జరిగింది? అనే దానిపై విచారణ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పీడియాట్రిక్‌ డాక్టర్ గా పనిచేస్తున్నారు డాక్టర్ శ్రీధర్‌ భార్య హిమబిందు. డాక్టర్ శ్రీధర్ తన క్లాస్ మేట్ డాక్టర్ హిమ బిందును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుకుంటున్న సమయంలో ఈ ఇద్దరితో పాటు డాక్టర్ దిలీప్‌ సత్య స్నేహితులుగా ఉండేవారు.

డాక్టర్ దిలీప్‌ ప్రస్తుతం చండీగఢ్‌లో భార్య దివ్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవలే పుదుచ్ఛేరిలో జిప్‌మర్‌ పరీక్ష రాసేందుకు వెళ్లారు. అక్కడి నుంచి డిసెంబర్ 25న ఉదయం 7.30గంటలకు ఢిల్లీ వెళ్ళిన డాక్టర్ దిలీప్.. అదే రోజున మధ్యాహ్నం 2.30కు చండీగఢ్‌ వెళ్లే రైలు ఎక్కాలి. ఃై

రైలుకి మధ్యాహ్నం వరకు సమయం ఉందని  శ్రీధర్‌ ఇంటికి వెళ్లారు డాక్టర్ దిలీప్. డాక్టర్ శ్రీధర్ అప్పటికే డ్యూటీకి వెళ్లిపోయారు. హిమ బిందు మాత్రమే ఇంట్లో ఉన్నారు. డాక్టర్ దిలీప్ వాళ్ళింట్లోనే టిఫిన్ చేసి హిమబిందుతో కలిసి బయటకు వెళ్లారు శ్రీధర్‌ తన డ్యూటీ అయిపోయాక భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. 

 ఆ తర్వాత డాక్టర్ దిలీప్‌ ఫోన్‌కు కాల్‌ చేసినా.. అదే సీన్. దీంతో కంగారుపడ్డ డాక్టర్ శ్రీధర్ ...రాత్రి 8.30 సమయంలో హౌజ్‌ఖాస్‌ పోలీస్‌ స్టేషన్ లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా ఇద్దరి ఆచూకీ తెలియలేదు. డాక్టర్ల మిస్సింగ్ వ్యవహారం ఎయిమ్స్ అసోసియేషన్లో చర్చనీయాంశం అయింది. పోలీసులను అప్రమత్తం చేశారు. చివరకు వీళ్ళిద్దరూ సిక్కింలో దొరకడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లిద్దరిని విచారించిన తర్వాత స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది. అసలిద్దరు ఎక్కడికి వెళ్ళారనేది విచారణలో తేలనుంది. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   10 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle