newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ బిల్లుల తరహాలోనే మహిళా బిల్లుకు కూడా మోక్షం!?

10-08-201910-08-2019 14:56:07 IST
Updated On 10-08-2019 15:35:55 ISTUpdated On 10-08-20192019-08-10T09:26:07.395Z10-08-2019 2019-08-10T09:26:04.702Z - 2019-08-10T10:05:55.887Z - 10-08-2019

ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ బిల్లుల తరహాలోనే మహిళా బిల్లుకు కూడా మోక్షం!?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కీలక బిల్లుల ఆమోదం విషయంలో వ్యూహాత్మకంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుల ఆమోదం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, విపక్షాల మద్దతు సైతం కూడగట్టి పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదముద్ర వేయించుకుని చట్టం చేసింది. వీటితో పాటే దేశంలో అత్యవసరంగా అమలులోనికి రావలసిన మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు కూడా పార్లమెంటు ఆమోదం పొందాల్సిన తక్షణ అవసరం ఉంది. 

మహిళా సాధికారత గురించి మాట్లాడని రాజకీయ పార్టీ ఉండదు. అయినా చట్ట సభలలో మహిళల రిజర్వేషన్ల బిల్లు విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదంటూ ఎన్నో ఏళ్లుగా పక్కన పెడుతున్నారు. ఈ విషయంలో మహాళా సభ్యుల డిమాండ్ ను సభ పట్టించుకోవడం లేదు. ఆకాశంలో  సగం...అవకాశాల్లో సగం అంటూ అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా ముందుకు దూసుకుపోతున్న మహిళలకు రాజకీయాలలోనికి వచ్చే సరికి మాత్రం చుక్కెదురౌతున్నది. వాస్తవానికి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాల్సి ఉంది. కానీ ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు కూడా ఆమోదం దక్కకపోవడానికి పార్లమెంటు ఉభయ సభలలోనూ కూడా పురుషాధిక్యతే కారణం.

సహజంగానే పురుషాహంకారంతో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. చట్ట సభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డం పడుతున్నది పార్టీలు కాదు...పార్టీలు తమ సిద్ధాంతం ప్రకారం మహిళా రిజర్వేషన్లను సమర్ధిస్తున్నాయి. కానీ ఆయా పార్టీల సభ్యులు మాత్రం వ్యక్తిగత హోదాలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగానే ఏ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బాహాటంగా చెప్పకుండానే...బిల్లు  ఆమోదం పొందకుండా ఏకాభిప్రాయ సాధన పేరిట అడ్డుకుంటున్నది. 

గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా...ఓటు బ్యాంకు రాజకీయాలకు తాము దూరం అని చాటుతూ యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ పునర్విభజన బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోద ముద్ర వేయించుకున్న మోడీ సర్కార్ అదే స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్ బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ వచ్చేలా అడుగులు వేయాలని మహిళా లోకం డిమాండ్ చేస్తున్నది. 

మోడీ 1.0 హయాంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందుతుందన్న భావన వ్యక్తమైంది. అయితే కారణాలేమైతేనేం...అప్పుడు కనీసం ఆ ప్రస్తావన తీసుకురావడానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.  ఇప్పటికీ ఆ విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. కనీసం విపక్షాలు బిల్లు గురించి ప్రస్తావించడం లేదు. దీనిని ఆయా పార్టీలకు, ప్రభుత్వాలకూ ఆ విషయంలో చిత్తశుద్ధి లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రధాని మోడీ మహిళా బిల్లు విషయంలో తన అభిప్రాయం, తమ ప్రభుత్వ అభిమతం వెల్లడించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మోడీ సర్కార్ కేవలం తమ రహస్య ఎజెండా మేరకే అడుగులు వేస్తున్నదని జనం భావించే ప్రమాదం ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle