ట్రబుల్ షూటర్ శివకుమార్ పప్పులు ఉడకలేదా?
11-07-201911-07-2019 14:29:19 IST
Updated On 12-07-2019 11:29:09 ISTUpdated On 12-07-20192019-07-11T08:59:19.008Z11-07-2019 2019-07-11T08:59:17.021Z - 2019-07-12T05:59:09.451Z - 12-07-2019

కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పతనం అంచున ఉంది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటమే పెద్ద సవాల్ లాంటిది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి మరీ జేడీఎస్‌తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారం దక్కించుకున్న బీజేపీని గద్దె దించింది. మూడు రోజులకే యడ్యురప్పను గద్దె దించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ నేత, ప్రస్తుత ఆ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. ముందు బెంగళూరులో, తర్వాత హైదరాబాద్‌లో ఆయన ఎమ్మెల్యేలతో క్యాంపులు సమర్థంగా నిర్వహించి బీజేపీ ఎంత ప్రయత్నించినా ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా చేసి ట్రబుల్ షూటర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వాస్తవానికి దేవెగౌడ కుటుంబంతో ఆయనకు సుదీర్ఘ రాజకీయ వైరం ఉంది. 2002లో ఆయన దేవెగౌడపై పోటీ చేసి ఓడిపయిన శివకుమార్ తర్వాత 2004లో అదే దేవెగౌడపై ఓ జర్నలిస్టును పోటీకి నిలబెట్టి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మరీ గెలిపించారు శివకుమార్. కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిస లాంటి శివకుమార్ పార్టీ కోసం ఎమ్మెల్యేలను కాపాడి రాజకీయ వైరాన్ని మరిచి కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయడంలో కీ రోల్ పోషించారు. ఇప్పుడు కూడా శివకుమార్ కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు శక్తిమేర ప్రయత్నించారు. బీజేపీ కూడా ఆయనను చూసే కొంత భయపెడుతోంది. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు ఉన్న ముంబాయి హోటల్లో రూమ్ బుక్ చేసుకొని వారితో మాట్లాడేందుకు వెళ్లారు. అయితే, హోటల్ యాజమాన్యం శివకుమార్ బుకింగ్‌ను క్యాన్సల్ చేసింది. దీంతో శివకుమార్ హోటల్ బయటే గంటల తరబడి వేచి ఉన్నారు. తన స్నేహితులు లోపల ఉన్నారని, వారి కోసం తప గుండె కొట్టుకుంటోందని, వారిని కలిసే అవకాశం ఇవ్వాలని భీష్మించుకు కూర్చున్నారు. లోపల ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు సైతం శివకుమార్‌పై తమకు గౌరవం ఉందని, ఆయన తమ స్నేహితుడే అని, అయితే, ఆయనను ప్రస్తుత పరిస్థితుల్లో కలవలేమని ప్రకటించారు. కొందరు మాత్రం శివకుమార్‌తో తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇలా శివకుమార్ సామర్థ్యాన్ని ముందే గుర్తించిన బీజేపీ, రెబల్ ఎమ్మెల్యేలు ఈసారి ఆయన వ్యూహాలు ఫలించకుండా అడ్డుకోగలిగారు. దీంతో ట్రుబుల్ షూటర్ అని పేరున్న శివకుమార్ ఈసారి మాత్రం ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. శివకుమార్ కు క్యాంపులు నడపడం, రాజకీయ వ్యూహాలు పన్నడం కొత్తేమీ కాదు. 2002లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో కర్ణాటకకు ఎమ్మెల్యేలను పంపిస్తే శివకుమార్ వారు చేజారకుండా క్యాంపు నిర్వహించారు. రెండేళ్ల క్రితం గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్ణాటకలో క్యాంపు నడిపి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యేలా చూశారు. దీంతో డీకే శివకుమార్ సామర్థ్యంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి సైతం నమ్మకం ఎక్కువ. ఇలా అధికార పార్టీలను ఢీకొట్టడంలో ముందున్న శివకుమార్‌పై కక్షసాధింపు చర్యలు జరిగినా ఆయన వెనక్కు తగ్గలేదు. అన్నిసార్లు రోజులు ఒకేలా ఉండవు కాబట్టి ప్రతీసారి శివకుమార్ సక్సెస్ అయినా ఈసారి మాత్రం ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా