newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

ట్రంప్ పర్యటనపై ఎక్కువ ఆశలు వద్దు.. వామపక్షాల ఐక్యతారాగం

24-02-202024-02-2020 11:26:42 IST
Updated On 24-02-2020 17:02:32 ISTUpdated On 24-02-20202020-02-24T05:56:42.217Z24-02-2020 2020-02-24T05:56:34.736Z - 2020-02-24T11:32:32.787Z - 24-02-2020

ట్రంప్ పర్యటనపై ఎక్కువ ఆశలు వద్దు.. వామపక్షాల ఐక్యతారాగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని అటు ప్రభుత్వం, ఇటు మీడియా బాకాలూదుతున్నప్పటికీ ట్రంప్ రాకతో భారత్‌కు ఒరిగేదేమీ ఉండదని దేశంలోని పాలక ప్రతిపక్షాలు ఒకే అభిప్రాయం ప్రకటిస్తున్నాయి. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై పూర్తి భిన్నాభిప్రాయంతో ఉండే బీజేపీ, వామపక్షనేతలు ఇరువురూ ట్రంప్ పర్యటన విషయంలో నిరాసక్తతను వ్యక్తం చేయడం విశేషం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన మన దేశానికి ఒరగపెట్టేది ఏమీ ఉండదని, ఆయన పర్యటన అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడంపైన దృష్టి పెట్టనుందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. ట్రంప్ తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికే ఇండియా వస్తున్నారు తప్పితే మన శ్రేయస్సుకోసం కాదన్నారు. కాబట్టి ట్రంప్ పర్యటనలో భారత్‌కు ఎలాంటి ప్రయోజనమైనా ఒరుగుతుందని నేను అనుకోవడం లేదని స్వామి స్పష్టం చేశారు.

ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కొన్ని రక్షణ ఒప్పందాలు జరగవచ్చు. ఇవి కూడా అమెరికాకు అనుకూలంగానే ఉంటాయి. పైగా అత్యాధునిక రక్షణ పరికరాలకు మనం చెల్లింంబోతున్నాం కానీ డొనాల్డ్ ట్రంప్ మనకు ఉచితంగా ఏమీ ఇవ్వబోవడం లేదని స్వామి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరుపట్ల స్వామి విమర్శిస్తుండటం తెలిసిందే.

తర్వాత అదే వేదికపైనుండి ప్రసంగించిన సీపీఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ భారత సందర్శనపట్ల మేం ఆందోళన చెందుతున్నాం. అమెరికా రైతులకు రాయితీలు సంపాదించడానికే ట్రంప్ భారత్ సందర్శిస్తున్నారు అని ఏచూరి పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు అందాలని ఏచూరి, స్వామి ఇద్దరూ అంగీకరిస్తున్నారు కానీ ఆర్థిక వ్యవస్థకు సంబందించి ఈ ఇరువురు నేతలకు భిన్న దృక్పథాలు ఉన్నాయి. 

ఆర్థికవ్యవస్థను చక్కదిద్దాలంటే జీఎస్టీని రద్దు చేయాలని, ఆదాయ పన్నును లేకుండా చేయాలని స్వామి చెబుతుండగా మౌలిక వసతుల కల్పనలో మరింత డబ్బు కేటాయించటం ద్వారా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ఏచూరి అభిప్రాయపడుతున్నారు.

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   2 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   3 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   3 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   7 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   9 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   12 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   12 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   13 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   13 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle