ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు
21-02-202021-02-2020 10:14:40 IST
2020-02-21T04:44:40.262Z21-02-2020 2020-02-21T04:44:29.239Z - - 16-04-2021

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం పలికేలా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతుంటే ఆయన పర్యటించే ఆగ్రాలోనూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. భారత్‌లో ట్రంప్ ఈనెల 23 నుంచి 26 వరకూ పర్యటించనున్నారు. అధిక సమయం ఢిల్లీలోనే గడపనున్నారు. అగ్రనేత రాకతో ఆగ్రా సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఈ చర్యలతో ఫిబ్రవరి 24 నాటికి ఆగ్రాలో యమునా నది శుభ్రంగా ఉంటుందని ఆశించవచ్చు. ఆగ్రా, దాని చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగు నీరు యమునా నదిలో కలుస్తోంది. దాంతో నదిలో ఆ మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నది చుట్టుపక్కల తీరమంతటా చెత్తాచెదారం పేరుకుపోయింది. ట్రంప్ పర్యటనతో ఇప్పుడు వాటిని కూడా శుభ్రం చేస్తున్నారు. వీధులకు పెయింటింగ్‌లు వేసి తీర్చిదిద్దడంతో పాటు యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. ట్రంప్ తన భారత పర్యటనలో యూపీలోని తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపధ్యంలో తాజ్‌మహల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్‌మహల్‌కు ఒకవైపున యమనానది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలో కలుషితమైన నీరు ప్రవహిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న సాయంత్రం ఆ అందాలను చూడ్డానికే ఆగ్రా చేరుకోనున్నారు. యమునా నది ఇప్పటికే కలుషితంగా మారింది. అమెరికా నుంచి వచ్చిన సెక్యూరిటీ బృందం తాజ్‌మహల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చారిత్రక కట్టడాన్ని సందర్శించి ట్రంప్ రాకకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. గత కొద్ది రోజులుగా 500 క్యూసెక్కుల నీటిని యుమనా నదిలోకి యూపీ ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది. నదీ జలాల వ్యర్ధాల నుంచి వచ్చే దుర్వాసనను నియంత్రించేందుకు తాజా నీటిని అధికారులు విడుదల చేశారు. గుజరాత్ లో ట్రంప్ కంటికి మురికివాడలు కనిపించకుండా గోడకట్టిన సంగతి తెలిసిందే. అయితే యమునా నది సమీపంలో గోడ కట్టడం సాధ్యం కాదు కనుక ఈ విధంగా యమునా నది పరిసర ప్రాంతాల్లో సుందరమయిన ఏర్పాట్లు చేశారు అధికారులు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా