newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

24-09-202024-09-2020 16:43:03 IST
2020-09-24T11:13:03.755Z24-09-2020 2020-09-24T11:12:56.339Z - - 17-04-2021

టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కట్టడి విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహ రహితంగా, ప్రణాళికా రహితంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలకు ఊతం ఇచ్చేనా ప్రధాని మోడీ నిన్న మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఉంది. దేశంలో పదుల సంఖ్యలో కరోనా కేసుల సంఖ్య ఉన్న సమయంలో ఏ జాగ్రత్తలు పాటించాలని మోడీ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారో... అవే విషయాలను ఆరు నెలల తరువాత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీలో చెప్పారు.

ఆరు నెలలుగా అవే జాగ్రత్తలు వల్లెవేస్తూ దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిమబ్బడిగా పెరుగుంటే చోద్యం చూస్తున్నట్లు కేంద్రం వ్యవహరించింది. కరోనా వ్యాప్తి తొలి రోజుల్లో టెస్టింగ్, ట్రేసింగ్ అంటూ గొప్పగా చెప్పిన ప్రధాని... వాటిని దేశంలో పటిష్టంగా అమలు జరిగేలా చూడటంలో విఫలమయ్యారు. ఇప్పుడు దాదాపు ఏడు నెలలు గడిచిన తరువాత దేశంలో 57లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన సమయంలో కూడా అదే టెస్టింగ్, ట్రేడింగ్ అంటూ ముఖ్యమంత్రులకు సూచనలు చేస్తూ... కట్టడిలో వైఫల్యాన్ని స్వయంగా చాటుకుంటున్నారు.

న్యూజిలాండ్, రష్యా, బ్రిటన్ అఖరికి అమెరికా వంటి దేశాలు కూడా కరోనా కట్టడిలో రోజు రోజుకూ సత్ఫలితాలను రాబడుతుంటే... భారత్ లో మాత్రం పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారౌతున్నది. కట్టడి చర్యల విషయంలో సైతం ఏకపక్ష వైఖరి, విపక్షాల సూచనలను ఖాతరు చేయని తీరుతో దేశంలో మహమ్మారి విజృంభణకు కారణమైన కేంద్ర సర్కార్... ఇప్పుడు మళ్లీ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ విధించుకోవాలని సూచిస్తున్నది.

సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల ఎదురైన విపత్తుల నుంచి ఇంకా బయటపడని రాష్ట్రాలకు మోడీ సూచన ఆశనిపాతం లాంటిదేనని చెప్పాలి. ప్రజా రోగ్యం, ప్రజల ప్రాణాల రక్షణ కంటే ఏదీ ముఖ్యం కాదని గొప్పగా చెప్పిన ప్రధాని రెండు నెలలకే ప్రజలను రక్షించుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమూ ముఖ్యమేనంటూ..దశల వారీ అన్ లాక్ డౌన్ కు తెరలేపారు.

ఇప్పుడు మళ్లీ ఆయన లాక్ డౌన్ రాష్ట్రాల పరిధిలోని అంశంగా మాట్లాడుతూ బాధ్యత నుంచి వైదొలగుతున్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రాల ఆదాయాలకు భారీగా గండి పడింది. ఇప్పుడు మళ్లీ కరోనా కట్టడి చర్యలలో అవసరమైతే లాక్ డౌన్ విధించుకోండంటూ సూచనలు చేస్తూ... రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజార్చే సూచనలు చేస్తున్నారు. మేలు జరిగితే మా ఘనత... లేకపోతే మీ వైఫల్యం అన్న చందంగా కేంద్ర సర్కార్ రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్నది. ఈ తీరు కారణంగానే కరోనా మహమ్మారి కట్టడి విషయంలో దేశంలో సమష్టి తత్వం కనిపించలేదు. 

దక్షిణాసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధరావీలో కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగిన మహా సర్కార్ బృహన్ ముంబై, పూణె వంటి నగరాలలో చేతులెత్తేసిందంటే అందుకు కేంద్రం నుంచి అందని సహకారమే కారణమని చెప్పాలి. అవసరం లేని సమయంలో అతిగా స్పందించి...నిజంగా కరోనా మహమ్మారి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే చేతులెత్తేసి ప్రజారోగ్యాన్ని గాలిలో దీపంగా మార్చేసింది. చాలా నెలల తరువాత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ జరిపిన బేటీ పూర్తిగా నిరుపయోగమైన ప్రసంగాలకే పరిమితమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   38 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle