టీఎంసీ వలస నేతల చేరికపై బీజేపీ నేతల అలక
03-06-201903-06-2019 07:22:24 IST
2019-06-03T01:52:24.273Z03-06-2019 2019-06-03T01:49:50.996Z - - 14-04-2021

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు, ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం మీద అలకబూనారట. ముఖ్యంగా బిర్భూమ్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మీద వరుసగా ఆరోపణలు చేస్తున్నారట. వీరి కోపానికి కారణం ఒక్కటే. లాభూర్ ఎంఎల్ఏ, టీఎంసీ నేత మునిరల్ ఇస్లాం బీజేపీలో చేరడాన్ని భిర్భూమ్ బీజేపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 2015లో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల హత్య కేసులో ఇస్లాం నిందితుడనీ, తాను ఆ ముగ్గురునీ ఎలా చంపానో బహిరంగంగా చెప్పిన ఇస్లాంను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని దిలీప్ ఘోష్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భిర్భూమ్ బీజేపీ అధ్యక్షుడు కల్సోనా మండల్. గతంలో మహిళలను లైంగికంగా వేధించిన పలు కేసుల్లో ఇస్లాం నిందితుడనీ, అతడిని పార్టీలో చేర్చుకుంటే, చాలా మంది కార్యకర్తలు, బీజేపీని వదలడం ఖాయం అంటున్నారు మండల్. పార్టీలోకి చెత్తను చేరిస్తే, దాని దెబ్బకు బెంగాల్లో బీజేపీ అవసాన దశకు చేరుతుందని చెబుతున్నారు. పార్టీ బలపడాలని తాము కోరుకుంటున్నా, ఇలాంటి వారితో కాదని చెబుతున్నారు. అయితే మోడీ పథకాలు నచ్చే తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఇస్లాం మాటల్లో చాలా తేడా కనిపిస్తోందట. ఎందుకంటే, 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వడానికి టీఎంసీ అధిష్టానం ఒప్పుకోలేదట. అందుకే ఆయన పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇస్లాం చేరికను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమర్థిస్తున్నారు. పార్టీకి జనబలంతో పాటు, అంగబలం కూడా ఉండాలని చెబుతున్నారట. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామనీ, తమ నిర్ణయాలను నేతలు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారట.

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
32 minutes ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
an hour ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
4 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
19 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
20 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
18 hours ago

మమత ప్రచారంపై 24 గంటల బ్యాన్. ఈసీ కొరడా..
13-04-2021
ఇంకా