టార్గెట్ పీవోకే
06-08-201906-08-2019 14:38:31 IST
Updated On 06-08-2019 14:51:28 ISTUpdated On 06-08-20192019-08-06T09:08:31.043Z06-08-2019 2019-08-06T09:08:28.343Z - 2019-08-06T09:21:28.780Z - 06-08-2019

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన బిల్లు టార్గెట్ పీవోకే. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ బిల్లు లోక్ సభ ఆమోదం పొందడం లాంఛనమే. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఎంత వ్యతిరేకించినా అడ్డుకునేందుకు తగిన బలం ఆ పార్టీలకు లేదన్నది నిర్వివాదాంశం.
ఇక అన్నిటికీ మించి ఆర్టికల్ 370 రద్దుపై దేశంలో ఎక్కడా నిరసన గళం వినిపించడం లేదు. పైపెచ్చు హర్షామోదాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్సీపీ వంటి పార్టీల వ్యతిరేకత హడావుడిగా బిల్లు ప్రవేశ పెట్టారెందుకని ప్రశ్నించడానికే పరిమితమవ్వడం ఆ బిల్లుకు అనుకూలంగా ప్రజలు నిలబడ్డారనడానికి సంకేతం. అసలు ఇక్కడ సమస్య ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం, అభ్యంతరం లేదు. అటువంటప్పుడు భారత్ లో అంతర్భాగమైన ఒక ప్రాంతానికి భారత చట్టాలు కూడా వర్తించనటువటి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకన్నదే ప్రశ్న. ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఈ ప్రశ్న పలు సార్లు జనసంఘ్, ఆర్ఎస్ఎస్ వంటివి సంధించాయి. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆందోళనలూ చేశాయి. అయితే మోడీ 2.0లో అత్యంత సాహసోపేతంగా ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. అయితే కేవలం 370 రద్దు అంటే జమ్మూ కాశ్మీర్, లఢక్ ప్రాంతాలకు రాష్ట్రస్థాయి ప్రతిపత్తి కల్పిస్తూ యూనియన్ టెరిటరీలో భాగం చేయడ మాత్రమే అని భావించడానికి వీల్లేదు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ లలో అంతర్భాగమేనని చాటడమే ఇప్పుడు ఈ చర్య ద్వారా మోడీ సర్కార్ ఉద్దేశమని భావించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో కుండబద్దలు కొడితే...లోక్ సభలో ఇదే విషయాన్ని కొంచం డిప్లమాటిగ్గా అమిత్ షా కూడా చెప్పారు. అసలింతకీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎలాంటి చట్టాలు చేయాలన్నా ఇంత కాలం పార్లమెంటుకు అధకారాలు లేకుండా చేస్తున్న 370 ఇప్పుడు రద్దైపోయింది. అంటే పాకిస్థాన్ కాశ్మీర్ వివాదంలో తామూ భాగమే అంటూ ఇంత కాలం చేస్తూ వస్తున్న వాదనను పూర్వపక్షం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చిందని భావించాల్సి ఉంటుంది. ఇంత కాలం ద్వైపాక్షిక అంశంగా ఉన్న కాశ్మీర్ వివాదం ఇప్పుడు భారత్ కు సంబంధించిన అంశంగా కేంద్రం స్పష్టం చేసింది. అంటే కాశ్మీర్ అంశం ఇక నుంచీ పూర్తిగా భారత్ అంతర్గత విషయం, అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో అమెరికాయే కాదు, ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కూడా భారత్ అంగీకరించదు.
ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా ఇంత వరకూ ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. కాశ్మీర్ విషయంలో కేంద్రంతో విభేదిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనే ఒక బలమైన సెక్షన్ బిల్లుకు గట్టిగా మద్దతు పలుకుతోంది. ఈ విషయమే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో వ్యతిరేకత పార్టీలూ, రాజకీయాలకు అతీతంగా గూడుకట్టుకుని ఉందన్న సంగతి తేటతెల్లమౌతున్నది. దేశంలో అంతర్భాగమైన ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగమేమిటన్న ప్రశ్న గట్టిగా ముందుకు వస్తున్నది. దేశంలో చేసిన చట్టాలు ఇక ఆ రాష్ట్రంలో కూడా అమలు జరుగుతాయన్న భావనే ఆర్టికల్ 370కి మద్దతుగా దేశ ప్రజలను ఐక్యం చేస్తున్నది.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా