newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

జ‌గ‌న్ బాట‌లో రాహుల్ గాంధీ..!

03-07-201903-07-2019 08:01:39 IST
Updated On 03-07-2019 11:53:49 ISTUpdated On 03-07-20192019-07-03T02:31:39.369Z03-07-2019 2019-07-03T02:31:27.410Z - 2019-07-03T06:23:49.860Z - 03-07-2019

జ‌గ‌న్ బాట‌లో రాహుల్ గాంధీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోవ‌డం లేదు. ఓట‌మితో వ‌చ్చిన నైరాశ్యానికి తోడు పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఓ వైపు త‌మ అధినేత రాజీనామాను ఉప‌సంహ‌రించుకోవాలంటూ దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌లు ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం బెట్టు వీడ‌టం లేదు.

అయితే, పార్టీని ప్ర‌క్షాళ‌న చేసి ద‌శాబ్దాలుగా క‌ద‌ల‌కుండా ఏఐసీసీలో కూర్చున్న సీనియ‌ర్ల‌ను ఇంటికి పంప‌డ‌మే రాహుల్ రాజీనామా వెనుక మ‌ర్మ‌మ‌ని తెలుస్తోంది. రాహుల్ గాంధీని పార్టీని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల‌నుకుంటున్నార‌ని, ఇందుకోసం రాహుల్ వ‌ద్ద చాలా పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దేశ‌వ్యాప్తంగా పార్టీని బ‌లోప‌తం చేసి అధికారంలోకి తీసుకురావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ఒక్క‌టే మార్గంగా భావిస్తున్నారు.

దేశంలో ఎక్కువ శాతం ఉన్న యువ‌త ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్‌కు దూర‌మై బీజేపీ వైపు మ‌ళ్ల‌డ‌మే ఇప్పుడు కాంగ్రెస్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం. దీనికి తోడు ద‌శాబ్దాల త‌ర‌బడి కాంగ్రెస్‌కు ద‌న్నుగా నిలిచే ద‌ళితులు, మైనారిటీలు పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి వీరిని పార్టీ వైపు తిప్పుకోవాలంటే నేరుగా వారిని క‌ల‌వ‌డ‌మే స‌రైన‌ద‌ని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. ఇందుకోసం ఆయ‌న త్వ‌ర‌లోనే భారీ యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌జ‌ల్లోకి భారీ యాత్ర‌ల ద్వారా వెళ్లిన నాయ‌కులు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. ఒక‌ప్పుడు దారుణ స్థితి చేరుకున్న బీజేపీని ఎల్‌.కే.అద్వానీ ర‌థ‌యాత్ర ద్వారా మ‌ళ్లీ బ‌లోపేతం చేశారు. మ‌న రాష్ట్రంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి త‌ర్వాతి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 3,500కు పైగా కిలోమీట‌ర్లకు పైగా పాద‌యాత్ర ద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డ‌మే ఆయ‌న విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణంగా జాతీయ మీడియా, రాజ‌కీయ విశ్లేష‌కులు అంతా అంచ‌నా వేశారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా జ‌గ‌న్ బాట‌లో పాద‌యాత్ర చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న ఈ దిశ‌గా భారీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

అన్ని రాష్ట్రాలను క‌లుపుకుంటూ పాద‌యాత్ర జ‌ర‌పాల‌ని, ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ద్వారా త‌న నాయ‌క‌త్వాన్ని నిరూపించుకోవ‌డంతో పాటు దూర‌మైన వ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర చేసుకోవ‌డంతో పాటు నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపాల‌ని రాహుల్ గాంధీ భావిస్తున్నార‌ట‌.

అయితే, దేశ‌మంతా పాద‌యాత్ర అనేక చాలా క‌ష్ట‌మ‌ని రాహుల్ గాంధీకి సూచ‌న‌లు అందుతున్నాయి. ఎన్నిక‌ల‌కు చాలాముందు పాద‌యాత్ర చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని కొంద‌రు రాహుల్‌కు సూచ‌న‌లు ఇస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే, సుదీర్ఘ పాద‌యాత్ర కావ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని, కేంద్రం జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళితే ఎన్నిక‌లు త్వ‌ర‌గానే వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త్వ‌ర‌లోనే రాహుల్ గాంధీ పాద‌యాత్ర ప్రారంభిస్తార‌నే ప్ర‌చారం మాత్రం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle