newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జ‌గ‌న్ కొట్టిన దెబ్బతో కూడా గుణ‌పాఠం నేర్చుకో‌లేదా..?

14-07-202014-07-2020 08:12:50 IST
2020-07-14T02:42:50.416Z14-07-2020 2020-07-14T02:37:06.586Z - - 23-04-2021

జ‌గ‌న్ కొట్టిన దెబ్బతో కూడా గుణ‌పాఠం నేర్చుకో‌లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌స్థాన్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్పుడు కుప్ప‌కూలేందుకు సిద్ధంగా ఉంది. స‌చిన్ పైలెట్ తిరుగుబాటుతో కాంగ్రెస్ స‌ర్కార్‌కు రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. బుజ్జ‌గింపులు, నెంబర్ గేమ్‌లు, బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌లు, రిసార్టు రాజ‌కీయాలు ఇప్పుడు రాజ‌స్థాన్‌లో షురూ అయ్యాయి. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగ‌రేసిన పీసీసీ అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైలెట్‌ను శాంతింప‌జేయ‌డానికి కాంగ్రెస్ ముఖ్యులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మ‌రోవైపు బీజేపీ కూడా ఆయ‌నతో ట‌చ్‌లో ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే యువ‌నేత జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్ప‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు స‌చిన్ పైలెట్ తిరుగుబాటులో రాజ‌స్థాన్‌లో ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంటోంది.

అయితే, బీజేపీ త‌మ ప్ర‌భుత్వాల‌ను కూల్చేస్తోంది, ఎమ్మెల్యేల‌ను కొనేస్తోంది అని కాంగ్రెస్ పాత పాట‌లే మ‌ళ్లీ పాడుతోంది. కానీ, బ‌ల‌మైన ప్రాంతీయ నేత‌లు, సామ‌ర్థ్యం ఉన్న యువ నేత‌ల‌ను గుర్తించ‌డంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఫ‌ల్యమే ఇక్క‌డ ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌కు ఒకేసారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ్యోతిరాధిత్య సింథియా, రాజ‌స్థాన్‌లో స‌చిన్ పైలెట్ అంతా తామై ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డం వెనుక వీరిదే కీల‌క పాత్ర‌. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ముఖ్య‌మంత్రులు అయ్యేది కూడా వీరేన‌ని అంతా అనుకున్నారు.

అంద‌రూ అనుకునేది కాంగ్రెస్ అధిష్ఠానం చేయ‌దు కాబ‌ట్టి పార్టీ సీనియ‌ర్లు అయిన క‌మ‌ల్‌నాథ్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు, అశోక్ గెహ్లాట్‌ను రాజ‌స్థాన్‌కు ముఖ్య‌మంత్రుల‌ను చేసింది. దీంతో వీరిద్ద‌రూ అప్పుడే అసంతృప్తికి లోన‌య్యారు. రాహుల్ గాంధీ బుజ్జ‌గించి ఏవో ప‌ద‌వులు అప్ప‌గించినా వారి సంతృప్తి చెంద‌లేదు. దీంతో వీరు స‌మ‌యం చూసుకొని తిరుగుబాటు ఎగ‌రేశారు. అలాగ‌ని వీరేమీ ఇలా కొత్త వారు కాదు. ఈ ఇద్ద‌రి కుటుంబాల‌కు కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధం ఉంది.

స‌చిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్ కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉండేవారు. కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. గాంధీ కుటుంబానికి స‌న్నిహితులు. 2000లో ఆయ‌న రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. జ్యోతిరాధిత్య సింథియా తండ్రి మాధ‌వ‌రావు సింథియా కూడా కాంగ్రెస్ నేత‌. కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. 2001లో ఆయ‌న విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

తండ్రులు మ‌ర‌ణించినా త‌న‌యులు మాత్రం ఇంత‌కాలం కాంగ్రెస్‌కే విధేయులుగా ప‌ని చేశారు. రాహుల్ గాంధీకి వీరు ద‌గ్గ‌రి వ్య‌క్తులు. పార్టీని త‌మ‌త‌మ రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావ‌డంలో స‌క్సెస్ అయ్యారు. కానీ, అందుకు త‌గ్గ గుర్తింపు రాక‌పోవ‌డంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది కాంగ్రెస్ పార్టీకి. అయితే, ఇలా బ‌ల‌మైన ప్రాంతీయ నేత‌ల‌ను, యువ నేత‌ల‌ను వ‌దులుకొని దెబ్బ తిన‌డం కాంగ్రెస్‌కు ఉన్న పాత అల‌వాటే. నిజానికి కాంగ్రెస్ అనే మ‌హా స‌ముద్రం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చాలా మంది నేత‌లు రాజ‌కీయంగా కాంగ్రెస్‌నే ఢీ కొట్టే స్థాయికి ఎదిగారు.

మ‌నంద‌రికీ ఇలా బాగా తెలిసిన ఉదాహ‌ర‌ణ వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. కేవ‌లం త‌న క‌ష్టం, వ్యూహంతో ఇక లేద‌నుకున్న కాంగ్రెస్‌ను వైఎస్సార్ ఏపీలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత 90 శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని కోరారు. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం జ‌గ‌న్‌ను కాద‌ని రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రుల‌ను చేసింది. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డి ఘ‌న విజ‌యం సాధించారు. లోక్‌స‌భ‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఎదిగారు. ఏపీలో కాంగ్రెస్‌ను నామ‌రూపాలు లేకుండా చేశారు.

నిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత జాతీయ మీడియా మొత్తం జ‌గ‌న్‌ను వ‌దులుకొని కాంగ్రెస్ ఎంత పెద్ద త‌ప్పు చేసింద‌నే విశ్లేష‌ణ‌లు చేసింది. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ గుణ‌పాఠం నేర్చుకుంటుందేమో అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ, అలా చేయ‌లేదు కాంగ్రెస్ పార్టీ.

అందుకే మొన్న జ్యోతిరాధిత్య సింథియా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చ‌గా, ఇప్పుడు రాజ‌స్థాన్‌లో స‌చిన్ పైలెట్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే కాదు కాంగ్రెస్‌లో గుర్తింపు లేక‌, అధిష్ఠానంతో పొస‌గ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రికొంద‌రు కూడా రాజ‌కీయంగా ఎదిగి కాంగ్రెస్‌నే స‌వాల్ చేసే స్థాయిలో ఉన్నారు.

యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కురాలిగా కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టి 26 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ప‌ని చేసిన మ‌మ‌తా బెన‌ర్జీకి కూడా కాంగ్రెస్‌లో గుర్తింపు లేక‌, రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌క బ‌య‌ట‌కు వ‌చ్చి తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంది. బెంగాల్‌లో రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. సోనియా గాంధీని వ్య‌తిరేకించి బ‌య‌ట‌కు వ‌చ్చి నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన శ‌ర‌ద్ ప‌వార్ మ‌హారాష్ట్ర‌లో, కేంద్రంలో కీల‌క నేత‌గా మారారు. ఇలా అనేక మంది నేత‌లను కాంగ్రెస్ వ‌దులుకొని ఇప్పుడు ప‌త‌నావ‌స్థ‌కు వేగంగా చేరుకుం

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   23 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle