newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. ఫుల్ బిజీగా ప్ర‌శాంత్ కిషోర్‌..!

15-12-201915-12-2019 20:35:01 IST
2019-12-15T15:05:01.570Z15-12-2019 2019-12-15T15:04:40.309Z - - 23-04-2021

జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. ఫుల్ బిజీగా ప్ర‌శాంత్ కిషోర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం త‌ర్వాత ఒక్క‌సారిగా ఆయ‌న పేరు మార్మోగిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీకి వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేశారు.

ఆ త‌ర్వాత కూడా ఆయ‌న ప‌లు పార్టీల కోసం ప‌ని చేసి స‌క్సెస్ అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ప‌నిచేయ‌గా, ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది.

అయితే, ఆయ‌న కెరీర్‌లో కొన్ని ఓట‌ములు కూడా ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ - ఎస్పీ కూట‌మి త‌ర‌పున ఆయ‌న ప‌ని చేసినా ఆ కూట‌మి దారుణం ఓడిపోయిందా.

ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ కిషోర్ లాంటి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌లు పుట్టుకురావ‌డంతో ప్ర‌శాంత్ డిమాండ్ కాస్త త‌గ్గింది. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఘ‌న విజ‌యం త‌ర్వాత ఆయ‌న డిమాండ్ మ‌ళ్లీ పెరిగింది.

ఎన్నిక‌ల‌కు సుమారు రెండేళ్ల ముందే ప్ర‌శాంత్ కిషోర్‌తో జ‌గ‌న్ ఒప్పందం కుదుర్చుకున్నారు. జ‌గ‌న్‌కు ఉన్న ప్ర‌జాబ‌లం ఓటుబ్యాంకుగా మార‌డానికి ప్ర‌శాంత్ వ్యూహాలు బాగా ప‌నిచేశాయి. వాస్త‌వానికి, ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కాబోయే ముఖ్య‌మంత్రి అనే ఒక ఇమేజ్‌ను బిల్డ‌ప్ చేయ‌డంలో ప్ర‌శాంత్ ప్ర‌చార వ్యూహ‌మే కీల‌కం. కాబ‌ట్టి, జ‌గ‌న్ భారీ విజ‌యంలో ప్ర‌శాంత్ క్రెడిట్ కూడా ఎంతోకొంత ఉంది.

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు జ‌గ‌న్ విజ‌యం వెనుక ప్ర‌శాంత్ కిషోర్ అని జాతీయ మీడియా కోడైకూసింది. దీంతో ప్ర‌శాంత్ పేరు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది.

త‌ర్వాత వివిధ రాష్ట్రాల నుంచి ఆయ‌న‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మొన్న‌టి మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో శివ‌సేన త‌ర‌పున ఆయ‌న ప‌ని చేశారు. ప్ర‌శాంత్‌ను త‌మ పార్టీ త‌ర‌పున ప‌నిచేయాల్సిందిగా దేశ‌వ్యాప్తంగా అనేక‌మంది నేత‌లు కోరుతున్నారు.

త‌మిళ‌నాడులో క‌మ‌ల్ హాస‌న్‌, స్టాలిన్ ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి ఆయ‌న ప‌నిచేసే అవకాశం ఉంది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆయ‌న‌ను సంప్ర‌దించారు.

వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వ‌చ్చాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బెంగాల్‌లో అధికారాన్ని మ‌ళ్లీ ద‌క్కించుకోవ‌డం మ‌మ‌త‌కు అంత ఈజీ కాదు. తృణ‌మూల్ కాంగ్రెస్‌కు బీజేపీ గ‌ట్టి ప్ర‌త్య‌ర్థిగా మారింది. దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌శాంత్ కిషోర్ స‌హ‌కారం కోరారు.

ఇక‌, వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌ర‌గ‌నున్న ఢిల్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ సంస్థ ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ(ఐప్యాక్‌) ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున ప‌ని చేయనుంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ నుంచి గ‌ట్టి పోటీ ఉంది. ఇప్ప‌టికే దేశ ఆర్థిక రాజ‌ధాని ఉన్న మ‌హారాష్ట్ర‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఇక‌, దేశ రాజ‌ధాని ఢిల్లీలో అయినా అధికారం ద‌క్కించుకోవ‌డం ఆ పార్టీకి అవ‌స‌రం ఉంది.

ఇటీవ‌లి పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అర‌వింద్ కేజ్రీవాల్‌ను దెబ్బ‌కొట్టేందుకు బీజేపీ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేస్తోంది. మ‌రి, న‌రేంద్ర మోడీకి వివిధ అంశాల్లో మింగుడు ప‌డ‌కుండా మారిన మ‌మ‌తా బెన‌ర్జీని, అర‌వింద్ కేజ్రీవాల్‌ను ప్ర‌శాంత్ కిషోర్ గ‌ట్టెక్కిస్తారో లేదో చూడాలి.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle