newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జైట్లీ, సుష్మ, ఫెర్నాండెజ్‌లకు పద్మవిభూషణ్ అవార్డులు

26-01-202026-01-2020 09:07:24 IST
Updated On 27-01-2020 15:52:45 ISTUpdated On 27-01-20202020-01-26T03:37:24.243Z26-01-2020 2020-01-26T03:34:06.555Z - 2020-01-27T10:22:45.383Z - 27-01-2020

జైట్లీ, సుష్మ, ఫెర్నాండెజ్‌లకు పద్మవిభూషణ్ అవార్డులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. మాజీ కేంద్రమంత్రి జా ర్జి ఫెర్నాండెజ్‌, అరుణ్‌ జైట్లీ, అనిరుద్‌ జగ్నాథ్‌ జీసీఎస్‌కే , ఎం.సి. మేరీ కోమ్‌, ఛన్నులాల్‌ మిశ్రా, సుష్మా స్వరాజ్, విశ్వేశతీర్థ స్వామీజీలకు పద్మవిభూషణ్ గౌరవం దక్కింది. 

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. 

పద్మభూషణ్‌ అందుకోనున్న వారిలో వేణు శ్రీనివాసన్‌ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). ఎం.ముంతాజ్‌ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్‌ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్‌), ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్‌), అజోయ్‌ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్‌), మనోజ్‌ దాస్‌ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్‌కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్‌–గుజరాత్‌), కృష్ణమ్మాళ్‌ జగన్నాథన్‌ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్‌.సి.జమీర్‌(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్‌), అనిల్‌ ప్రకాష్‌ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్‌), త్సెరింగ్‌ లాండోల్‌ (వైద్యం, లదాఖ్‌), ఆనంద్‌ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్‌ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్‌ గోపాలకృష్ణ పారికర్‌ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ) వున్నారు. 

చదవండి :  ఆ ఇద్దరికీ ఈసారి పద్మభూషణ్‌ గ్యారంటీనా?

వీరితో పాటు 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)  విజయసారథి శ్రీభాష్యం (విద్యారంగం) పద్మశ్రీ అందుకోనున్నారు.  జగదీశ్‌ లాల్‌ అహుజా, జావేద్‌ అహ్మద్‌ తక్- సామాజిక సేవ, మహ్మద్‌ షరీఫ్‌, తులసి గౌడ - సామాజికసేవ, పర్యావరణం, సత్యనారాయణ్‌- సామాజిక సేవ, విద్యా విజ్ఞానం, అబ్దుల్‌ జబ్బార్‌ - సామాజిక సేవ, ఉషా చౌమార్‌ - పారిశుద్ధ్యం, పోపట్‌రావ్‌ పవార్‌ - సామాజిక సేవ, నీటి విభాగం, హరికలా హజబ్బా- సామాజిక సేవ, విద్యా విభాగం, అరుణోదయ్‌ మండల్‌ - వైద్య, ఆరోగ్యం, రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ - సేంద్రియ వ్యవసాయం, కుశాల్‌ కన్వర్‌ (అసోం) - పశువైద్యం, ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం, సుందరవర్మ (రాజస్థాన్‌) - పర్యావరణం, అడవుల పెంపకం, ట్రినిటీ సయూ (మేఘాలయ) - సేంద్రియ వ్యవసాయం, రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle