newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

20-01-202020-01-2020 12:14:55 IST
Updated On 21-01-2020 12:55:43 ISTUpdated On 21-01-20202020-01-20T06:44:55.650Z20-01-2020 2020-01-20T06:44:51.602Z - 2020-01-21T07:25:43.394Z - 21-01-2020

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయ‌న ఎన్నిక‌కు ఇవాళే ముహూర్తం ఖ‌రారైంది. బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఇవాళ న‌డ్డా నామినేష‌న్ వేయ‌బోతున్నారు. ఆయ‌న‌కు పోటీగా ఎవ‌రూ నామినేష‌న్ వేయ‌డం లేదు. దీంతో న‌డ్డా ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్నారు.

అనంత‌రం ఆయన అమిత్ షా నుంచి బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. అమిత్ షా త‌ర్వాత బీజేపీని న‌డిపించే నాయ‌కుడు ఎవ‌ర‌నే దానిపై పార్టీలో, ఆర్ఎస్ఎస్‌లో చాలా రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా అయితే మేల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన పార్టీ ఆయ‌న‌కు ఆరు నెల‌ల క్రితం బీజేపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ బాధ్య‌త‌లు ఇచ్చింది. అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నాక పార్టీ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డానికి న‌డ్డాకు ఈ ప‌ద‌వి ఇచ్చారు.

అధ్య‌క్ష ప‌ద‌వి న‌డ్డాకు ఇవ్వాల‌ని అప్ప‌టికే నిర్ణ‌యించిన బీజేపీ ఆయ‌న‌కు పార్టీ వ్య‌వ‌హారాల ప‌ట్ల సంపూర్ణ అవ‌గాహ‌న కోసం ముందుగా వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ ప‌ద‌వి ఇచ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌నే పార్టీ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నారు.

59 ఏళ్ల జేపీ న‌డ్డా గ‌త‌సారి న‌రేంద్ర మోడీ క్యాబినెట్‌లో ఆరోగ్య శాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగమైన అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) నుంచి త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు.

విద్యార్థి నాయ‌కుడిగా ఉన్న స‌మ‌యంలోనే ఎమ‌ర్జెన్సీలో ఆయ‌న 45 రోజుల పాటు జైలు జీవితం కూడా గ‌డిపారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన న‌డ్డా 1993లో మొద‌టి సారి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

1960 డిసెంబ‌ర్ 2న న‌రైన్ లాల్ న‌డ్డా, క్రిష్ణ న‌డ్డా దంప‌తుల‌కు జ‌న్మించిన న‌డ్డా బిహార్ రాజ‌ధాని ప‌ట్నాలోని సెయింట్ జేవియ‌ర్స్ స్కూల్‌లో చ‌దువుకున్నారు. త‌ర్వాత ప‌ట్నా యూనివ‌ర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వెళ్లారు. అక్క‌డి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. అక్క‌డే త‌న రాజ‌కీయ జీవితాన్ని ఆరంభించారు. 1993, 1998, 2007లో ఆయ‌న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా ప‌ని చేశారు.

మొద‌టిసారి 2010 మేలో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల్లోకి ప్రవేశించారు. అప్ప‌టి బీజేపీ అధ్య‌క్షుడు నితిన్ గ‌డ్క‌రీ ఆయ‌న‌ను బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న బీజేపీ జాతీయ పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2012 ఏప్రిల్‌లో ఆయ‌న‌ను పార్టీ రాజ్య‌స‌భ‌కు పంపించింది. ఇటీవ‌లి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బాధ్య‌త‌లు తీసుకొని పార్టీ క్లీన్ స్వీప్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో బీజేపీ అధ్య‌క్ష పీఠానికి న‌డ్డానే స‌రైన వార‌ని భావించిన పార్టీ ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చింది.

జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా కుటుంబానికి వ‌స్తే ఆయ‌న భార్య మ‌ల్లికా న‌డ్డా. వారికి ఇద్ద‌రు కుమారులు. జేపీ న‌డ్డా అత్త జ‌య‌శ్రీ బెన‌ర్జీ కూడా రాజ‌కీయాల్లో చాలాకాలంగా ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలిగా ఉన్న ఆమె గ‌తంలో లోక్‌స‌భ‌కు కూడా ఎన్నికయ్యారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle