newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

19-02-202019-02-2020 09:05:51 IST
2020-02-19T03:35:51.997Z19-02-2020 2020-02-19T03:35:46.462Z - - 11-04-2021

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ ప‌య‌నం ఎటువైపు అనేది తేల్చుకోలేక‌పోతున్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌మ‌యంలో చాలా రోజుల పాటు ఏ పార్టీలో చేరాలో అనే డైల‌మాలో ఉండేవారు. ఇప్పుడు జ‌న‌సేన పార్టీని వీడాక కూడా ఇదే డైల‌మాలో ఉన్నారు. ఆయ‌న భారతీయ జ‌న‌తా పార్టీలో చేర‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగినా తాజాగా ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది.

ఐపీఎస్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని భావించిన ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ, తెలుగుదేశం పార్టీల వైపు చూసి, స్వంత పార్టీ స్థాపించాల‌నే ఆలోచ‌న చేశారు. కానీ, చివ‌ర‌కు ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీలో చేరి విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జ‌న‌సేన‌లో నెంబ‌ర్ 2గా కొన‌సాగిన ఆయ‌న ఏడాది కూడా ఉండ‌కుండానే ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

త‌ర్వాత ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు సీటుపైనే క‌న్నేసిన ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీలో చేరితే బెట‌ర్ అని భావించిన‌ట్లు తెలిసింది. విశాఖ‌లో బీజేపీకి కొంత ప‌ట్టుండ‌టం, ఉత్త‌ర భార‌తీయుల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉండ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల ఆయ‌న బీజేపీ నుంచి వ‌చ్చేసారి మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేయాల‌నే ఆలోచ‌న చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న మ‌న‌స్సు మార్చుకున్నార‌ని, ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క‌మైన జ‌గ‌న్ ఆస్తులు, గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి అక్ర‌మ మైనింగ్ కేసుల‌ను సీబీఐ జేడీ హోదాలో ల‌క్ష్మీనారాయ‌ణ విచారించారు. ఈ స‌మ‌యంలో రెండు, మూడేళ్ల పాటు ప్ర‌తీ రోజు వార్త‌ల్లో ఉన్నారాయ‌న‌. అవినీతిప‌రుల పాలిట సింహ‌స్వ‌ప్నంగా ఆయ‌న‌ను రాష్ట్రంలో కొంద‌రు భావిస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు అవినీతికి వ్య‌తిరేకం అనే ఇమేజ్ ఉంది.

ఢిల్లీలోనూ ఐఆర్ఎస్ అధికారిగా ప‌ని చేసి అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడిన అర‌వింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి స‌క్సెస్ అయ్యారు. ఇటీవ‌ల ఆయ‌న భారీ విజ‌యం సాధించి మూడోసారి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్న త‌ర్వాత దేశ‌వ్యాప్తంగానూ ఆమ్ ఆద్మీ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెల‌కొంటోంది. ల‌క్ష్మీనారాయ‌ణ కూడా ఢిల్లీలో ఆప్ విజ‌యం త‌ర్వాత ఆ పార్టీలో చేరితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.

ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరితే ఆ పార్టీ రాష్ట్ర బాధ్య‌త‌లు క‌చ్చితంగా ఆయ‌న‌కే ఇచ్చే అవ‌కాశం ఉంది. అంతేకాదు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కూడా ఆయ‌నే అవుతారు. ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా యువ‌త‌లో ఉన్న ఇమేజ్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆధ‌ర‌ణ కూడా తోడైతే మంచి ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు అనే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి, ల‌క్ష్మీనారాయ‌ణ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. కానీ, త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీలో లేదా ఆప్‌లో చేరే అవ‌కాశాలు మాత్రం ఉన్నాయ‌ని తెలుస్తోంది

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle