newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జేఎన్‌యూ దాడి హిందూరక్షాదళ్ పనేనా?

07-01-202007-01-2020 12:26:07 IST
Updated On 07-01-2020 12:27:21 ISTUpdated On 07-01-20202020-01-07T06:56:07.195Z07-01-2020 2020-01-07T06:56:03.332Z - 2020-01-07T06:57:21.800Z - 07-01-2020

జేఎన్‌యూ దాడి హిందూరక్షాదళ్ పనేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవునంటోంది ఆ సంస్థ. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆదివారం రాత్రి జరిగిన హింసాకాండ కలకలం రేపింది. దీనిపై వామపక్ష విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ దాడికి తామే బాధ్యులమని  రైట్ వింగ్ గ్రూప్ హిందూ రక్షా దళ్ సంచలన ప్రకటన చేసింది. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేత ఐషే ఘోష్‌తో పాటు మరో 35మంది వరకు ఈ దాడిలో గాయపడ్డారు.

ఈదాడులపై ఏబీవీపీ,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే వున్నాయి. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడింది తామే అంటూ రైట్ వింగ్ గ్రూప్ హిందూ రక్షా దళ్ సంచలన ప్రకటన చేయడంతో కేసు మలుపులు తిరుగుతోంది. 

మరోవైపు ఢిల్లీ పోలీసులు అయిషే ఘోష్ సర్వర్ రూంలు ధ్వంసం చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేయడం చర్చనీయాంశంగా మారింది. జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి సంచలన ప్రకటన చేశారు.

జేఎన్‌యూ క్యాంపస్‌లో సంఘ విద్రోహ,హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే తాము ఈవిధంగా దాడి చేశామని, ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని పింకీ చౌదరి చేసిన ప్రకటనపై పోలీసులు స్పందించారు. దీనిపై విచారణ జరుపుతామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

హిందూ రక్షా దళ్ ఈమేరకు చేసిన ప్రకటన ప్రకారం.. ‘'వాళ్లు మన దేశంలో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ,ఇక్కడే చదువుకుంటూ,దేశ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అందుకే జేఎన్‌యూపై దాడి చేశాం. ఆ దాడిలో పాల్గొన్నదంతా మా హిందూ రక్షా దళ్ సభ్యులే. దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాం’’ అన్నారు. జేఎన్‌యూ హింసాకాండలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు.. క్యాంపస్‌లోని వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle