newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జేఎన్‌యూ అంటే విద్యార్థి ఉద్య‌మాలేనా..?

11-01-202011-01-2020 07:56:38 IST
Updated On 11-01-2020 07:56:58 ISTUpdated On 11-01-20202020-01-11T02:26:38.767Z11-01-2020 2020-01-11T02:26:28.337Z - 2020-01-11T02:26:58.318Z - 11-01-2020

జేఎన్‌యూ అంటే విద్యార్థి ఉద్య‌మాలేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ(జేఎన్‌యూ) ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటుంది. విద్యార్థి ఉద్య‌మాలు, వివాదాస్ప‌ద ఆందోళ‌న‌ల‌తో జేఎన్‌యూ త‌ర‌చూ వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది.

ఇక్క‌డి వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు దేశానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని, ఉద్య‌మిస్తున్నాయ‌నేది ఏబీవీపీ, బీజేపీ వాద‌న‌. తాము ప్ర‌జాస్వామ్య‌వాదుల‌మ‌ని, రాజ్యాంగాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులుగా త‌మ బాధ్య‌త‌గా పోరాడుతున్నామ‌నేది వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాల నాయ‌కుల మాట‌.

పార్ల‌మెంటుపై దాడి చేసిన‌ తీవ్ర‌వాది అఫ్జ‌ల్ గురు ఉరికి వ్య‌తిరేకంగా, క‌శ్మీర్‌కు స్వాత్రంత్య్రం కావాల‌ని ప‌లు వివాదాస్ప‌ద‌, దేశ‌వ్య‌తిరేక ఆందోళ‌న‌ల‌ను కూడా ఇక్క‌డి కొంద‌రు విద్యార్థులు నిర్వ‌హించారు. ఈ ఆందోళ‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. విద్యార్థి నాయ‌కుల అరెస్టులు జ‌రిగాయి. త‌ర్వాత కూడా జాతీయ స్థాయి నుంచి అంత‌ర్జాతీయ స్థాయి వ‌ర‌కు వివిధ అంశాల‌పై ఇక్క‌డి విద్యార్థులు త‌మ గ‌ళం విప్పుతుంటారు.

ఇటీవ‌ల అయోధ్య‌పై సుప్రీం కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా, తాజాగా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్య‌తిరేకంగా జేఎన్‌యూలో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే, జేఎన్‌యూ విద్యార్థుల‌పై కొంద‌రు దుండ‌గులు దాడులు చేసి విద్యార్థి సంఘం అధ్య‌క్షురాలు, ప్రొఫెస‌ర్లు స‌హా 33 మందిని తీవ్రంగా గాయ‌ప‌రిచారు.

ఈ దాడుల‌పై దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు గాయ‌ప‌డ్డ విద్యార్థుల‌కు సంఘీభావం తెలుపుతున్నారు. మ‌రికొంద‌రు గ‌తంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల‌ను చూపిస్తూ విద్యార్థుల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. అయితే, ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా జ‌వ‌హ‌ర‌ల్ లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ గురించి తెలుసుకోవ‌డానికి ఈ ఉద్య‌మాలే కాకుండా చాలా విష‌యాలు ఉన్నాయి.

1969లో ఢిల్లీలో సుమారు వెయ్యి ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటైంది ఈ యూనివ‌ర్సిటీ. సుమారు 5500 మంది విద్యార్థులు జేఎన్‌యూలో చ‌దువుకుంటుంటారు. ప్ర‌పంచంలోని ఉత్త‌మ విశ్వ‌విద్యాల‌యాల్లో జేఎన్‌యూకు ప‌లుమార్లు చోటు ద‌క్కింది. ఇక్క‌డ చ‌దువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్న‌త స్థానాల‌కు ఎదిగారు.

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి జైశంక‌ర్ చ‌దివింది కూడా ఈ యూనివ‌ర్సిటీలోనే. వీరే కాదు సీపీఎంలో అగ్ర‌నేత‌లుగా అనేక ఏళ్లుగా కొన‌సాగుతున్న సీతారం ఏచూరి, ప్ర‌కాశ్ కార‌త్ కూడా ఈ యూనివ‌ర్సిటీ నుంచి వ‌చ్చిన వారే. ఇంకా అనేక మంది జేఎన్‌యూ నుంచి వ‌చ్చి రాజ‌కీయ నేత‌లుగా ఎదిగారు.

రాజ‌కీయాల్లోనే కాదు సివిల్ స‌ర్వెంట్లుగా దేశానికి ఎంతో మంది జేఎన్‌యూ పూర్వ‌విద్యార్థులు సేవ‌లందించారు. సుమారు 300 మంది సివిల్ స‌ర్వెంట్లు జేఎన్‌యూ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన వారే. వీరంతా వివిధ రాష్ట్రాల్లో సేవ‌లందిస్తున్నారు.

అంతేకాదు, ప్ర‌స్తుత నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా జేఎన్‌యూలో చ‌దువుకున్న వారే. ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధిగా వివిధ అంశాల్లో దేశం గ‌ళాన్ని వినిపిస్తున్న స‌య్య‌ద్ అక్బ‌రుద్దీన్ చ‌దివింది కూడా ఈ యూనివ‌ర్సిటీలోనే.

జేఎన్‌యూలో గ‌తంలో విద్యార్థుల మ‌ధ్య ఒక స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉండేది. జాతీయంగా, అంత‌ర్జాతీయంగా అనేక అంశాల‌పై ఇక్క‌డ చ‌ర్చ‌లు జ‌రిగేవి. రాత్రి భోజ‌నం ముందు వివిధ అంశాల‌పై జేఎన్‌యూలో చ‌ర్చ‌లు జరుగుతుంటాయి.

అన్ని సిద్ధాంతాలు న‌మ్మెవారు ఇక్కడికి వ‌చ్చి త‌మ వాద‌న‌ను వినిపిస్తుంటారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, య‌శ్వంత్ సిన్హా, ద‌లైలామా,  కె.ఆర్‌.నారాయ‌ణ‌న్‌, మేధా ప‌ట్కార్‌, షీలా దీక్షిత్‌, స‌ల్మాన్ ఖుర్షీద్‌, అరుణ్ జైట్లీ, ఉమాభార‌తి వంటి వివిధ పార్టీల‌, ప‌ర‌స్ప‌ర వైరుధ్యాలు ఉన్న నేత‌లు ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు.

ఈ చ‌ర్చ‌ల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు. ఇక జేఎన్‌యూ ఎన్నిక‌లు అయితే సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తుంటాయి. విద్యార్థులు స్వ‌యంగా నిర్వ‌హించే ఈ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్ష‌, ఏబీవీపీ మ‌ధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఎక్కువ‌గా వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలే ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాయి. జేఎన్‌యూ అధ్య‌క్షులు కూడా త‌ర్వాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle