newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూలైలో పార్లమెంట్...వర్చువల్, హైబ్రిడ్ విధానంలో సమావేశాలు

10-06-202010-06-2020 08:38:44 IST
2020-06-10T03:08:44.411Z10-06-2020 2020-06-10T03:08:21.327Z - - 14-04-2021

జూలైలో పార్లమెంట్...వర్చువల్, హైబ్రిడ్ విధానంలో సమావేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా దేశంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాని ప్రభావం పార్లమెంటు సమావేశాలపై కనిపిస్తోంది. గత సంప్రదాయాల లాగే వర్షాకాల సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఇరు సభల సెక్రటరీ జనరల్స్‌ స్పష్టం చేశారు. కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ సీట్లకు కేటాయించినా∙సమావేశ మందిరాల్లో సభ్యులందరికీ సీట్లు కేటాయించలేమన్నారు. 

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో, విజ్ఞానభవన్‌ ప్లీనరీ హాల్‌లో అందరు సభ్యులకు సీట్లు కేటాయించగలిగేంత స్థలం లేదన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎంతమంది ఎంపీలకు సభలో సీట్లు కేటాయించగలమో వారికి తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ సీట్లను ఏర్పాటు చేస్తే రాజ్యసభ సమావేశ మందిరంలో 60 మందికే కూర్చునే అవకాశం లభిస్తుంది అలాగే పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో 100 మందికే కూర్చునే వీలు కల్పించవచ్చన్నారు. 

అందరూ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు హాజరుకావడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదంటున్నారు. అందుకే ఆన్‌లైన్‌ ద్వారా వర్చువల్‌ విధానంలోనో, లేదా హైబ్రిడ్‌ విధానంలోనో సమావేశాల నిర్వహణ సాధ్యమవుతుందా? అనే విషయాన్ని ఓం బిర్లా, వెంకయ్య పరిశీలించారు. కొందరు సభ్యులు ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరైతే మిగతావారు వీడియో లింక్‌ ద్వారా వర్చువల్‌గా సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. ఆయా ఎంపీలు ఎప్పుడు పాల్గొనవచ్చో తెలియచేయనున్నారు.

పార్లమెంటు సమావేశాలను వర్చువల్‌గానో, హైబ్రిడ్‌ విధానంలోనో నిర్వహించడానికి సంబంధించి అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించాలని సెక్రటరీ జనరల్స్‌ను ఇరు సభల అధ్యక్షులు ఆదేశించారు. అంతేకాదు రోజువిడిచి రోజు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా పార్లమెంటులో వివిధ బిల్లులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. గతంలోలాగా సభన స్తంభింపచేయడం, పార్లమెంట్ బయట ఆందోళనలు చేయడం విపక్షాలకు అంతగా సాధ్యం కాకపోవచ్చు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle