జూన్ 1 నుంచి రైల్వే ప్రయాణాలు.. ఏసీ, నాన్ ఏసీ కూడా !
21-05-202021-05-2020 08:51:13 IST
Updated On 21-05-2020 10:15:02 ISTUpdated On 21-05-20202020-05-21T03:21:13.240Z21-05-2020 2020-05-21T03:21:04.565Z - 2020-05-21T04:45:02.878Z - 21-05-2020

ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఇతర ప్రాంతాలకు రైళ్ళలో వెళ్ళాలని భావిస్తున్న వారికి రైల్వేశాఖ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి ఏసీ, నాన్ ఏసీలలో ప్రయాణాలకు పచ్చజెండా ఊపింది. దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో నాన్–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతిలో ప్రయాణాలు సాగించవచ్చు. ఇప్నటికే వందలాది శ్రామిక్ రైళ్ళు నడుస్తున్నాయి. వీటి సంఖ్యను కూడా రైల్వే శాఖ పెంచబోతోంది.
ముందస్తు టికెట్ బుకింగ్‌లు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్ కోచ్ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రేట్లు పెంచడం లేదని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది.
తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్ళ వివరాలివే..
హైదరాబాద్–ముంబై: సీఎస్టీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్–హౌరా: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ – దానాపూర్: దానాపూర్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్– గుంటూరు: గోల్కొండ ఎక్స్‌ప్రెస్
నిజామాబాద్– తిరుపతి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్– విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్
హౌరా–యశ్వంతపూర్: దురంతో ఎక్స్‌ప్రెస్
ఎర్నాకులం– నిజాముద్దీన్: దురంతో ఎక్స్‌ప్రెస్
దానాపూర్–కేఎస్ఆర్ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్‌ప్రెస్
ఆర్ ఎసీ, వెయిటింగ్ లిస్టులు కూడా వుంటాయి. అయితే వెయిట్ లిస్ట్ ప్రయాణికులను రైళ్లలోకి అనుమతించరు.
మరోవైపు ఆహారం కోసం రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసింది రైల్వేశాఖ. గతంలో కాకుండా ఈసారి రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి మంజూరు చేసింది. అయితే అందుకు నియమాలు పాటించాలి. రైల్వే స్టేషన్లలో కేటరింగ్ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలి. అంతేకాదు ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినడం కుదరదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రైల్వే కోచ్ లలో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.




ఏపీలో స్కూల్స్ బంద్
14 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
18 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
15 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
a day ago

ఈ టైంలో అవసరమా మేడమ్
a day ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా