newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జిన్ పింగ్ టూర్... కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చ

11-10-201911-10-2019 08:20:32 IST
2019-10-11T02:50:32.878Z11-10-2019 2019-10-11T02:38:06.815Z - - 11-04-2021

 జిన్ పింగ్ టూర్... కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ పరిణామాలు, పాకిస్తాన్ వైఖరి.. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు రోజుల పర్యటన కోసం జిన్ పింగ్ చెన్నైకి చేరుకున్నారు. చైనా రాజధాని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై శివార్లలోని మామళ్లాపురం పట్టణానికి బయలుదేరి వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నారు.

తొలిసారిగా తమ రాష్ట్రానికి రానున్న జిన్ పింగ్ కు చెన్నై విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు భారీ స్థాయిలో జిన్ పింగ్ మాస్క్ లను ధరించారు. జిన్ పింగ్ భారీ చిత్రపటాన్ని తమ కళాశాల మైదానంలో ఆవిష్కరించారు. ఆ చిత్రపటం ముందు చైనా లిపిలో స్వాగతం పలుకుతూ ఆసీనులయ్యారు. 

సుమారు రెండువేల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఏ దేశాధ్యక్షుడైనా సరే.. తమ రాష్ట్రానికి తొలిసారిగా రాబోతుండటం పట్ల ఆనందంగా ఉందని, పైగా ఆసియాలో అత్యంత శక్తిమంతమైన చైనా దేశాధ్యక్షుడే రాబోతుండటం గర్వకారణంగా ఉందని చెన్నై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై దగ్గర్లోని మహాబలిపురంలో ప్రధాని మోడీ-జిన్ పింగ్ రెండు రోజుల పాటు చర్చలు జరుపుతారని . ఇందులో ఎలాంటి ఎంవోయూలు, ఒప్పందాలు, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటివేమీ ఉండవు. 

ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించి ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటారు. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇద్దరు చర్చిస్తారని దౌత్యవర్గాలు చెబుతున్నాయి.

సోయాబీన్, బాస్మతి కాకుండా ఇతర రకాల బియ్యం ఎగుమతులు, ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధులు అందడంపైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

జిన్ పింగ్ కాన్వాయ్ వాహనాలు బుధవారమే చెన్నైకి చేరుకున్నాయి. ఆ వాహనాల్లోనే ఆయన ప్రయాణిస్తారు. సముద్రతీర ప్రాంతమైన మామళ్లాపురంలో భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మామళ్లాపురంలో పూర్తయ్యాయి. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిన్ పింగ్ సహా ఆయనతో పాటు వచ్చే అధికారుల బృందానికి అక్కడే బసను ఏర్పాటు చేశారు. మొత్తం మీద కీలకమయిన సమయంలో జిన్ పింగ్ టూర్ పై పాకిస్తాన్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle