జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజ
23-12-201923-12-2019 12:25:20 IST
2019-12-23T06:55:20.067Z23-12-2019 2019-12-23T06:55:17.757Z - - 14-04-2021

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ కూటమికి షాకిచ్చేలా వున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతోంది. జేఎం- కాంగ్రెస్ కూటమి ఆధిక్యత చూపిస్తోంది. జేఎంఎం కాంగ్రెస్ కూటమి 39 స్ధానాల్లో ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ 29 స్ధానాల్లో ముందంజలో వుంది. ఏజేఎస్‌యూ 5 స్ధానాల్లో, ఇతరులు 8 స్థానాలు సాధించే అవకాశాలున్నాయి. మొత్తం 81 స్ధానాలు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 41. జేఎంఎం కాంగ్రెస్ కూటమి కీలక సంఖ్యను చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్పూర్ తూర్పు స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ తాను పోటీచేసిన రెండు స్ధానాల్లోనూ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి స్వల్ప ఆధిక్యత కనబరుస్తుందన్న తెలిపిన సంగతి తెలిసిందే. అయితే హంగ్ కు దూరంగా కాంగ్రెస్ కూటమి విజయం దిశగా పరుగులు పెడుతోంది. పాలక బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న ఫలితాలు చివరి వరకు ఉండవని రఘుబర్ దాస్ స్పష్టం చేశారు. చివరి రౌండ్ పూర్తయ్యే వరకు వేచి చూడాలంటున్నారు సీఎం రఘుబర్ దాస్. మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందన్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
6 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
10 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
11 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
12 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
14 hours ago
ఇంకా