newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జార్ఖండ్‌లో తొలిదశ పోలింగ్ షురూ

30-11-201930-11-2019 09:24:25 IST
Updated On 30-11-2019 12:43:38 ISTUpdated On 30-11-20192019-11-30T03:54:25.819Z30-11-2019 2019-11-30T03:54:05.102Z - 2019-11-30T07:13:38.743Z - 30-11-2019

జార్ఖండ్‌లో తొలిదశ పోలింగ్ షురూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జార్ఖండ్ లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మావోయిస్టుల కదలికలతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆరు జిల్లాల్లోని13 అసెంబ్లీ స్థానాలలో సుమారు 37 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. బీజేపీ12 స్థానాల్లో పోటీ చేస్తోంది. 

పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాలు అక్కడ కొలువు తీరాయి. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ కూటమికి 41 సీట్లతో సింపుల్‌ మెజార్టీ వచ్చింది.

దీంతో ప్రభుత్వం ఏర్పాటైంది. జార్ఖండ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81. మొత్తం అయిదు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా, రెండవ దశ ఎన్నికల పోలింగ్ డిసెంబర్‌ 7న, మూడవ దశ డిసెంబర్‌ 12, నాలుగవ దశ డిసెంబర్‌ 16, ఐదవ దశ పోలింగ్ డిసెంబర్‌ 20న జరగనుంది. ఫలితాలు డిసెంబర్‌ 23న వెల్లడి అవుతాయి. 

జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల నేరచరిత్ర ఎక్కువే.  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్న సర్వే ప్రకారం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్థులలో ముగ్గురు,  జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి బరిలోకి దిగిన 14 మంది అభ్యర్థులలో ఐదుగురు,  బిజెపి నుంచి కంటెస్ట్ చేస్తోన్న 20 మంది అభ్యర్థులలో ఐదుగురిపై నేరారోపణలున్నాయి.

అలాగే, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతంత్రిక్) పార్టీ నుంచి 20 మంది అభ్యర్థుల్లో.. ఐదుగురు ,ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులలో ఒకరు…  తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారు. ఈసీ తాజా నిబంధనల ప్రకారం అభ్యర్ధులు తమ నేరచరిత్ర గురించి అఫిడవిట్లతో పాటు మీడియాలోనూ ప్రకటన చేయాల్సి వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle