newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

జాతీయ రాజకీయాలను శాసించనున్న యూపీ ఫలితాలు

22-05-201922-05-2019 07:25:18 IST
Updated On 27-06-2019 12:45:04 ISTUpdated On 27-06-20192019-05-22T01:55:18.406Z22-05-2019 2019-05-22T01:54:37.245Z - 2019-06-27T07:15:04.472Z - 27-06-2019

జాతీయ రాజకీయాలను శాసించనున్న యూపీ ఫలితాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నిక‌ల్లో దేశ ప్రజ‌లంద‌రి చూపూ ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో మొత్తం 80 ఎంపీ సీట్లు ఉండ‌టంతో పాటు, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా 71 సీట్లు గెల్చుకుంది. అందుకే ఈసారి అక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఓవైపు అప్నాద‌ళ్ పార్టీకీ ఒక సీటు కేటాయించిన బీజేపీ, మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒంట‌రి పోరు చేసింది.  ఇక స‌మాజ్ వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ పొత్తు పెట్టుకుని బ‌రిలో దిగాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలో దిగినా, కొన్నిచోట్ల ఎస్పీ, బీఎస్పీల‌కు ప‌రోక్షంగా స‌హ‌ర‌కించింద‌ట‌. దీంతో ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌తంలో గెలిచిన వాటిలో సగం కూడా రావ‌న్న ప్రచారం జ‌రిగింది. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్ నివేదిక‌లు విప‌క్ష పార్టీల‌కు కంగుతినిపించాయి.

తాము అనుకన్నది ఒక‌టి, అయింది మ‌రొక‌టి కావ‌డంతో టెన్షన్ ప‌డుతున్నాయి. ఆ పార్టీల టెన్షన్ ఎలా ఉన్నా, వాస్తవ ప‌రిస్థితులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటోంది సెంట‌ర్ ఫ‌ర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ పాలిటిక్స్ సంస్థ. ప్రతి ఎన్నిక‌ల స‌మ‌యంలో వాస్తవ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసే ఈ కాన్పూర్ సంస్థ ఈ ఎన్నిక‌ల మీద‌ కూడా ఉత్తర‌ప్రదేశ్ మొత్తం స‌ర్వే చేసి, ఓ నివేదిక విడుద‌ల చేసింది.

అన్ని స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఓట్ల బ‌దిలీ మీద ఆశ‌లు పెట్టుకున్న ఎస్సీ, బీఎస్పీలకు జ‌నం ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్లు ఈ సంస్థ ప్ర‌క‌టించింది. కాగిత లెక్కల‌కు, వాస్తవ ప‌రిస్థితుల‌కు చాలా తేడా ఉంద‌నేది ఆ సంస్థ చెప్పే మాట‌. ఎందుకంటే, అన్ని ద‌శ‌ల పోలింగులో అఖిలేష్, మాయావ‌తి పార్టీల మ‌ధ్య ఓట్ల బ‌దిలీ చాలా త‌క్కువ‌గా జ‌రిగింద‌ట‌.

గ‌తంలో ముస్లింలు పూర్తిగా అఖిలేష్ వైపు ఉండేవారు. కానీ ప్రియాంక వాద్రా ప్రచారంలో దిగ‌డంతో, ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు మ‌ళ్లాయ‌ట‌. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వ‌స్తేనే మోడీని ఓడించ‌వ‌చ్చనీ, ఎస్పీ, బీఎస్పీ కూట‌మికి ఓటు వేస్తే ఉప‌యోగం లేకుండా పోతుంద‌ని ముస్లింలు భావించార‌ట‌. 

దీంతో ముస్లింల ఓట్లు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కూట‌మి మ‌ధ్య చీలిన‌ట్లు తేలింది. మ‌రో ఇష‌యం ఏంటంటే, పొత్తులో భాగంగా స‌మాజ్ వాదీ పార్టీ 37 సీట్ల‌లో పోటీ చేసింది. అయితే ఆ పార్టీ నుంచి టిక్కెట్ రాని వారు ఎదురు తిరిగార‌ట‌. వీరిలో కొంద‌రు కాంగ్రెస్ వైపు వెళ్లితే, మ‌రికొంద‌రు బీజేపీ వైపు మొగ్గుచూపార‌ట‌.

ఇక మొద‌టి నుంచీ స‌మాజ్ వాదీ పార్టీని మోస్తున్న యాద‌వుల ఓట్లలో కూడా చీలిక వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్రగ‌తిశీల స‌మాజ్ వాదీ పార్టీ పెట్టుకున్న అఖిలేష్ బాబాయ్ శివ‌పాల్ యాద‌వ్ వైపు ఎక్కువ మంది యాద‌వులు మొగ్గుచూపిన‌ట్లు తేలింది. దీంతో వారి ఓట్లు చీలాయి. 

ఇక సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధులు నిల‌బ‌డిన చోట, బీఎస్పీ కేడ‌ర్ వారికి ఓటు వేయ‌లేదు. మొద‌టి నుంచీ యాద‌వులు, ద‌ళితులు మ‌ధ్య ఉన్న వైరంతో ద‌ళితుల ఓట్లలో ఎక్కువ శాతం బీజేపీ వైపు మ‌ళ్లిన‌ట్లు తేలింది.

దీంతో ఎస్పీ అభ్యర్ధులు బ‌ల‌హీన‌ప‌డ్డార‌ట‌. అలాగే బీఎస్పీ అభ్యర్ధులు నిల‌బ‌డిన సీట్లలో యాద‌వులు వారికి ఓటు వేయ‌లేద‌ట‌. ఎందుకంటే మాయావ‌తి అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది యాద‌వుల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ కోపం యాద‌వుల్లో ఇప్ప‌టికీ ఉంద‌ట‌. అందుకే వారు బీఎస్పీ అభ్యర్ధుల‌కు ఓటే వేయ‌లేదు. ఒక‌వేళ యాద‌వ వ‌ర్గానికి చెందిన వ్యక్తి బ‌రిలో ఉంటేనే ఓటేశార‌ట‌. 

మ‌రో విష‌యం ఏంటంటే, ఒక‌ప్పటి మాదిరిగా ద‌ళితులు మొత్తం మాయావ‌తి వైపు లేద‌ని తేలిపోయింది. ఆమెను చాలా మంది ద‌ళితులు న‌మ్మడం లేద‌ట‌. ఎందుకంటే 2014 ఎన్నిక‌ల్లో యూపీలోని 17 ఎస్సీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ గెలిచింది.

అలాగే 2017 యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 86 ఎస్సీ రిజ‌ర్వేష‌న్ ఉన్న స్థానాల్లో 70 బీజేపీ గెలిచింది. అంటే ద‌ళితులు ఓట్లు బీఎస్సీ, బీజేపీ మ‌ధ్య చీలిన‌ట్లు అర్థం అవుతోంది. ఈ ప‌రిణామాల‌న్నీ బీజేపీకి క‌లిసొచ్చాయ‌నీ, అందుకే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు గెల్చుకుంద‌ని కాన్పూర్ సంస్థ తేల్చింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle