newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జాతీయాంశాలపై కాంగ్రెస్‌కు విధానమే లేదా?

23-10-201923-10-2019 14:49:59 IST
Updated On 23-10-2019 15:16:37 ISTUpdated On 23-10-20192019-10-23T09:19:59.882Z23-10-2019 2019-10-23T09:19:56.887Z - 2019-10-23T09:46:37.531Z - 23-10-2019

జాతీయాంశాలపై కాంగ్రెస్‌కు విధానమే లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సావర్కార్ కు భారత రత్న అంశంలో కాంగ్రెస్ విమర్శలు బూమరాంగ్ అయ్యాయి. సావర్కార్ కు గాడ్సేతో పోలుస్తూ ఆ పార్టీ సినియర్ నేతలు చేసిన విమర్శల వల్ల పార్టీకి నష్టమే వాటిల్లింది. ఈ ఒక్క అంశం అని కాదు...దేశం మొత్తాన్ని కదిలించగల ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ విధానంలో కానీ, వైఖరిలో కానీ స్పష్టత లేక తడబడుతుంటే...అవే అంశాలపై ఒప్పో తప్పో బీజేపీ మాత్రం ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. సావర్కార్ విషయాన్నే తీసుకుంటే...ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ తొలి స్పందన దేశ వ్యాప్తంగా ఒక చిన్న దుమారాన్నే రేపింది.

అదే సమయంలో బీజేపీ విస్పష్టంగా వీర సావర్కార్ భారత రత్న పురస్కారానికి అన్ని విధాలుగా అర్హుడంటూ చేసిన వాదన నేరుగా ప్రజలకు చేరింది. అదే సమయంలో కాంగ్రెస్ వైఖరిలో స్పష్టత కొరవడింది. ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులు విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరేమో సావర్కార్ కమిటి కేంద్రంలో అధికారం ఉంది కనుక గాంధీజీని హత్య చేసిన నాధూరాం గాడ్సేకు కూడా భారత రత్న పురస్కారం ప్రదానం చేసినా ఆశ్చర్యం లేదని విమర్శలు గుప్పిస్తే...అభిషేక్ సింఘ్వీ వంటి నాయకులు సావర్కార్ క్రమశిక్షణ కలిగిన సమర యోధుడు అంటూ కితాబిచ్చారు. ఈ ద్వంద్వ వైఖరీ, విధానాలలో ద్వైదీ భావమే కాంగ్రెస్ కు శాపంగా మారింది. జాతీయ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయగలిగే అంశాలపై కాంగ్రెస్ కు ఒక స్పష్టత లేకపోవడంతోనే ఆ పార్టీ క్రమంగా ప్రజాదరణను కోల్పోతున్న పరిస్థితి వస్తున్నది.

అమెరికా ఫస్ట్ అన్న నినాదం డోనాల్డ్ ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిని చేసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ను సీఎంను చేసింది. ఒకే దేశం, ఒకే చట్టం వంటి విధానాలు మోడీని ప్రధానిని చేశాయి. వాటిని గమనించడంలో....ప్రజల మూడ్ ను పట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలం అవుతున్న కారణంగానే వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత ఘోరంగా పరాజయం పాలైంది. తాజాగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆ పార్టీ కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేనంత దూరంలో నిలిచిపోనున్నదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

సావర్కార్ ను దేశ భక్తుడిగా అంగీకరించే విషయంలో కాంగ్రెస్ తడబాటు ఆ పార్టీకి నష్టమే చేసింది.  జాతీయ వాదానికి సంబంధించి మిత, అతి వాదాల మధ్య ఉన్న సూది బెజ్జమంత తేడాను గుర్తించడంలో ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం ఘోరంగా విఫలమౌతున్నదని చెప్పాలి. ఈ బలహీనత కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వానిదే గానీ, గతంలో నాయకత్వానికి, నాయకులకు ఇటువంటి ద్వైదీ భావం లేదు. ఇటువంటి బలహీనతా లేదు. శ్రీమతి ఇందిగా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సావర్కార్ దేశానికి సేవలను గుర్తిస్తూ.. ఆయన స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఇందిరాగాంధీ సావర్కార్ స్మారక నిథికి విరాళం కూడా ఇచ్చారు.

అంతెందుకు భారత ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న సమయంలో సంస్కరణలను ప్రవేశ పెట్టి ప్రపంచానికి దిశ, దశ చూపిన నాయకుడు పీవీ నరసింహరావునే కాంగ్రెస్ పార్టీ పరాయిని చేసింది. ఇవన్నీ ప్రస్తుత నాయకత్వంలోనే జరిగాయి. భారతీయత, జాతీయత పట్ల అవగాహనాలేమి కారణంగా అగ్రనాయకత్వం తీసుకునే పొరపాటు నిర్ణయాలను నివారించే పాటి సాహసం చేయగలిగిన నేత నేడు కాంగ్రెస్ లో కాగడా పెట్టి వెతికినా కనిపించని కారణంగానే ఆ పార్టీ నేడీ దుస్థితికి చేరుకుంది. కాంగ్రెస్ ధోరణి ఇలాగే కొనసాగితే...భవిష్యత్ లో గాంధీ, నెహ్రూకుటుంబీకుల చరిత్ర తప్ప కాంగ్రెస్ కు గత చరిత్ర ఏమీ మిగలని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది.    

 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle