జర్మనీ ఫార్ములాపై ప్రపంచం దృష్టి!
18-04-202018-04-2020 17:18:18 IST
Updated On 18-04-2020 17:33:17 ISTUpdated On 18-04-20202020-04-18T11:48:18.790Z18-04-2020 2020-04-18T11:48:08.964Z - 2020-04-18T12:03:17.210Z - 18-04-2020

జర్మనీ పేరు వినగానే మనకు హిట్లర్ గుర్తుకువస్తారు. నియంతగా పేరున్న హిట్లర్ జర్మనీని ప్రపంచ దేశాలు భయపడేలా చేశాడు. తాజాగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న వేళ జర్మనీ అనుసరించిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దేశంలో కేసులు పెరిగిపోతున్నా సత్వర పరీక్షలు.. అత్యవసర వైద్యం అందుబాటులోకి తెచ్చింది. మూకుమ్మడి వ్యూహంతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. జర్మనీ యుద్ధ ప్రాతిపదిక అనుసరించిన వ్యూహం.. ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం విజయవంతం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా జర్మనీలో 4352 మంది మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1,41,399 మంది వున్నారు. 77 వేలమంది వరకూ రికవరీ అయ్యారు. జర్మనీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయినా.. తర్వాత అందుకు గల మూలాన్ని పరిశోధించారు. కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతులం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో మరణమృదంగం మోగిస్తున్నది. అయితే మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే జర్మనీ కరోనాను సమర్థంగా నిలువరిస్తోంది. ఇటలీ, బ్రిటన్లలో మరణాల రేటు 12 శాతం ఉండగా, జర్మనీలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నాయి. జర్మనీ అనుసరించిన విధానం మిగిలిన దేశాలకు దిక్సూచిగా మారింది. మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే జర్మనీ అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది. తద్వారా వేగవంతంగా బాధితులను గుర్తించి, వారిని ఐసొలేట్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగింది. వారానికి దాదాపు 5 లక్షల మందికిపైగా పరీక్షలు నిర్వహించింది. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. కరోనా ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. జర్మనీలో 60 ఏండ్లు పైబడిన వారు కేవలం 20 శాతం మందే ఉన్నారు. అదే ఇటలీ, స్పెయిన్ వంటి ఇతర ఐరోపా దేశాల్లో ఈ వయసు వారు దాదాపు 50 శాతానికి పైగా ఉన్నారు. జర్మనీ జనాభా సగటు వయసు 45.7 ఏండ్లు కాగా, 65 ఏండ్లు పైబడిన వారు 21 శాతం వున్నారు. జర్మనీలో వృద్ధుల జనాభా అధికంగా ఉన్నా కరోనా వైరస్ కోసం విస్తృత పరీక్షలు, ఐసొలేషన్, నిర్ణీత దూరం పాటించడం వంటి చర్యల ద్వారా ఆ దేశం ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. జర్మనీలో నాణ్యమయిన వైద్య విద్య, మౌలిక వసతులు వున్నాయి. జర్మనీలో ప్రతి లక్షమందికి 34 వెంటిలేటర్లు ఉన్నాయి. అదే ఇటలీలో కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా