newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జనాభా రిజిస్టర్‌పై రాద్ధాంతం ఎందుకు?

22-01-202022-01-2020 08:39:15 IST
Updated On 22-01-2020 11:16:08 ISTUpdated On 22-01-20202020-01-22T03:09:15.253Z22-01-2020 2020-01-22T03:08:46.102Z - 2020-01-22T05:46:08.365Z - 22-01-2020

జనాభా రిజిస్టర్‌పై రాద్ధాంతం ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా జాతీయ జనాభా రిజిస్టర్‌పై అపోహలు ఏర్పడ్డాయని,  ప్రజలు అందించాల్సిన సమాచారం తప్పనిసరి కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే సీఏఏపై గందరగోళం ఏర్పడింది. ఈశాన్యరాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో  జనాభా రిజిస్టర్‌ సమయంలో ప్రజల వ్యక్తిగత సమాచారం వెల్లడించాల్సి ఉండటంపై కొన్ని బీజేపీయేతర పాలనా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 

ఎన్‌పీఆర్‌కి ఇవ్వాల్సిన సమాచారం విషయంలో వివరణ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తమ వివరాలు స్వచ్ఛందంగా ఇవ్వవచ్చని, అందులో నిర్బంధం లేదని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే 2010లో ఎన్‌పీఆర్‌ ప్రారంభించిందని, రాజ్యాంగపరంగా విధిగా ఈ ప్రక్రియ నిర్వహించాలన్నారు. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది పోయి అపోహలు కలిగించడం సమంజసం కాదన్నారు.

2021 ఏప్రిల్‌లో జాతీయ జనాభా గణనకు ముందు జరిగే ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. ఎన్‌పీఆర్‌ ఫామ్‌లో పుట్టిన వివరాలు, తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ వంటివి ఉండటంతో ఎన్సార్సీకి ముందు జరిగే తతంగమేనంటూ ఈశాన్య రాష్ట్రాలు, బీజేపీయేత పాలనా రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కేరళ వంటి రాష్ట్రాలు జనాభా గణనకు సహకరిస్తామే తప్ప ఎన్‌పీఆర్‌కు అంగీకరించబోమని తేల్చి చెప్పేశాయి. ఇక పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంతో అమీతుమీకి సిద్దం అవుతోంది. 

2014లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇంటింటికీ తిరిగి వారి వివరాలు, బ్యాంకు అకౌంట్లు, మెడికల్‌ హిస్టరీ వంటి ఎన్నో ప్రశ్నలు అడిగినా ఎవరూ ఎందుకు నోరెత్తలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్‌పీఆర్‌పై వివాదం రాజకీయ దురుద్దేశపూరితమన్నారు. దేశవ్యాప్తంగా త్వరలో ఎన్ పీఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పట్టికలో డేటాను గ్రామాలు, ఉప జిల్లాలు, జిల్లాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో సేకరిస్తారు.

గత ఆరు నెలల నుంచి ఒక ప్రాంతంలో స్థిరనివాసం ఉన్నవారు, మరో ఆరు నెలలు ఆదే ప్రాంతంలో ఉండాలని అనుకుంటున్న వారి నుంచి వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా గణనకు ముందు ఏడాది 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్‌పీఆర్‌ డేటాని సేకరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో ఇంటింటికీ తిరిగి ఈ పట్టికను సవరించారు. ఆ సమయంలో ప్రజల నుంచి ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్లు అడిగి తెలుసుకున్నారు. ఈసారి డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు ఐడీ కార్డు వివరాలు అడిగే అవకాశాలున్నాయి.  అయితే ఏ వివరాలైనా ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వాలని కేంద్రం సూచించింది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle