newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ సమావేశాలు

16-01-202016-01-2020 11:17:36 IST
2020-01-16T05:47:36.690Z16-01-2020 2020-01-16T05:46:47.387Z - - 10-04-2021

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ సమావేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడ‌త‌లుగా జరుగుతాయి. ఈ మేర‌కు బ‌డ్జెట్ స‌మావేశాల తేదీలను ప్రకటించారు..జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11వరకు తొలి విడత స‌మావేశాలు జ‌రుగుతాయి.  మార్చి 2 నుంచి ఏప్రిల్ 3వరకు రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.

తొలి విడ‌త స‌మావేశాలు ఈనెల 31న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర‌ బడ్జెట్‌ను ఆర్థి మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెడ‌తారు.ఈ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 11 వ‌ర‌కు జ‌రుగుతాయి. ఇక మార్చి 2 నుంచీ ఏప్రిల్ 3 వరకు రెండో విడ‌త బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలకు సీఏఏ ప్రధాన అస్త్రం కానుంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధిరేటు తగ్గడం వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఎలాంటి ఉద్దీపనలు ప్రతిపాదిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle