newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జగన్ కి దక్కని అమిత్ షా 'బర్త్ డే గిఫ్ట్'?!

23-10-201923-10-2019 09:20:26 IST
Updated On 23-10-2019 15:18:43 ISTUpdated On 23-10-20192019-10-23T03:50:26.398Z23-10-2019 2019-10-23T03:50:24.608Z - 2019-10-23T09:48:43.459Z - 23-10-2019

జగన్ కి దక్కని అమిత్ షా 'బర్త్ డే గిఫ్ట్'?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో దాదాపు నలభై నిమిషాలు చర్చలు జరిపి ఏపీకి కావాల్సిన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని.. విభజన అంశాలను నెరవేర్చాలని కూడా నివేదికలు ఇచ్చారని ప్రభుత్వ అనుకూల మీడియాకు సమాచారమిచ్చారు. ఆయా సంస్థలు కూడా బ్రేకింగ్ ప్లేట్స్ గిరగిరా తిప్పి అదే విషయాన్ని ప్రజల కళ్ళకు చూపించారు.

కానీ అసలు జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో నలభై నిమిషాల భేటీ జరిగిందా? జరిగితే ఆ భేటీలో ఏ విషయాలను చర్చించారు? అందుకు అమిత్ షాను వచ్చిన సమాధానమేంటి? అని అడిగితే ప్రభుత్వం నుండి ఒక్కరూ సూటి సమాధానం చెప్పలేకున్నారు. దాని వెనుక కారణం ఏమిటని విశ్లేషిస్తే ఈరోజు అమిత్ షా పుట్టినరోజు. అయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన ఓ వందమంది ప్రముఖులలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరని మాత్రమే తెలిసింది. జగన్ షా ఇంటికి వెళ్లి శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పి వచ్చారే తప్ప అక్కడ మరో అంశానికే అవకాశం లేకుండాపోయిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి జగన్ షాతో భేటీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఒకసారి వెళ్తే ప్రధాని దొరికారు కానీ షాగారు మాత్రం అందుబాటులో లేరు. మరోసారి అపాయింట్ మెంట్ ఇచ్చి చివరి క్షణంలో క్యాన్సిల్ చేశారు. దఫాలుగా వాయిదాలు పడుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉండడంతో చివరికి ఈరోజు అయన పుట్టినరోజునే కరుణించారు. అనుకున్నదే తడువుగా సీఎం కూడా విమానం ఎక్కేసి ఢిల్లీలో అయన గుమ్మం ముందు వాలిపోయారు. అయితే అనుకున్న కార్యం మాత్రం కానేలేదని చెప్తున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అమిత్ షాతో రెండు పనులున్నాయని తెలుస్తుంది. ఒకటి ప్రతివారం తమ బోనులోకి రావాల్సిందేనని సిబిఐ ససేమీరా అంటుంటే కేంద్రం నుండి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, రాష్ట్రంలో బీజేపీ ప్రతిఘటన వంటివాటిపై కూడా పార్టీ పెద్దగా అమిత్ షా వద్దనే తాళం ఉంది. అందుకే షా దూరం దూరం వెళ్తున్నా జగన్ దగ్గర దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ షా పుట్టినరోజున కూడా జగన్ రెడ్డికి గిఫ్ట్ దక్కనట్లేనని రాజకీయవర్గాలలో వినిపిస్తుంది.

చివరికి హోంమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వరకు వెళ్లి వచ్చారా అన్నట్లుగా మారిన జగన్ ఢిల్లీ టూర్ వెనుక కర్త-కర్మగా ఉన్న విజయసాయి రెడ్డికి కూడా ఈ ఘటనలో అక్షింతలు పడ్డట్లుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. షాతో సమావేశం ఇలా అయితే ఇక మరో ఇద్దరు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్లను క్యాన్సిల్ చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

జగన్ షాతో భేటీ అనంతరం కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, బొగ్గు శాఖమంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా భేటీ కావాల్సి ఉంది. సిబిఐ వ్యక్తిగత మినహాయింపు కేసు వచ్చే నెల ఒకటో తేదీనే తీర్పు రానుండగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు ఆయా శాఖల మంత్రులను కలవాల్సి ఉంది. కానీ ఇద్దరినీ కలవకుండానే నేరుగా ఢిల్లీ నుండి విశాఖలో దిగి అరకు ఎంపీ మాధవి రిసెప్షెన్ కి వెళ్లి తిరిగి అమరావతికి తిరిగొచ్చేశారట!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle