newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చైనా పేరెత్తాలన్నా భయమేనా.. రక్షణమంత్రిపై రాహుల్ ఫైర్

18-06-202018-06-2020 12:00:17 IST
Updated On 18-06-2020 12:21:46 ISTUpdated On 18-06-20202020-06-18T06:30:17.588Z18-06-2020 2020-06-18T06:30:15.245Z - 2020-06-18T06:51:46.679Z - 18-06-2020

చైనా పేరెత్తాలన్నా భయమేనా.. రక్షణమంత్రిపై రాహుల్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గాల్వన్‌ లోయలో భారత్, చైనాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటన రాజ్‌నాథ్‌ సింగ్‌కు అంత బాధ కలిగిస్తే.. ఆ ట్వీట్‌లో చైనా పేరు ప్రస్తావించకుండా భారత ఆర్మీని ఎందుకు కించపరిచారని ప్రశ్నించారు. ఇలా మొత్తం ఐదు ప్రశ్నలను రాజ్‌నాథ్‌కు సంధించారు.

1. మీరు ట్వీట్‌లో చైనా పేరు ప్రస్తావించుకుండా భారత ఆర్మీని ఎందుకు కించపరిచారు? 2. సంతాపం తెలుపడానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? 3. ఓ వైపు సైనికులు అమరలవుతూంటే మరోవైపు ప్రసంగాలు ఎందుకు చేశారు? 4. అనుకూల మీడియాతో ఆర్మీని నిందిస్తూ.. ఎందుకు దాక్కున్నారు? 5. పెయిడ్‌ మీడియా భారత ప్రభుత్వాన్ని కాకుండా ఆర్మీని ఎందుకు నిందించింది?

అంతకు ముందు రాజ్‌నాథ్‌ తన ట్వీట్‌లో ‘వారి ప్రాణత్యాగం నన్ను మనోవేదనకు గురి చేసింది. సైనికుల త్యాగాల‌ను, ధైర్యాన్ని దేశం ఎన్న‌డూ మ‌రిచిపోదు. గాల్వ‌న్ దాడిలో చ‌నిపోయిన సైనికుల కుటుంబాల‌కు ఇదే నా ప్రగాడ సానుభూతి . క్లిష్ట స‌మ‌యంలో దేశం అంతా క‌లిసిక‌ట్టుగా ఉంది. భార‌తీయ బ్రేవ్‌హార్ట్స్ ప‌ట్ల గ‌ర్వంగా ఉంది. గాల్వ‌న్‌లో సైనికులు చ‌నిపోవ‌డం బాధాక‌రం. స‌రిహ‌ద్దు విధుల్లో మ‌న సైనికులు అత్యంత ధైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించారు. అత్యున్న‌త స్థాయిలో సైనికులు త‌మ ప్రాణాల‌ను త్యాగం చేశారు’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో 20 మంది సైనికుల వీరమరణంపై ట్విటర్లో స్పందించిన రాజ్‌నాథ్.. చైనా పేరు ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని అవమానించారంటూ దుయ్యబట్టారు. సైనికుల మరణంపై సంతాపం తెలిపేందుకు రెండు రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ రాహుల్ రక్షణ మంత్రిని నిలదీశారు. ఓ వైపు సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే.. మరోవైపు రాజ్‌నాథ్ ర్యాలీల్లో ప్రసంగాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సైనికుల మరణం తీవ్రంగా బాధించిందంటూ ఇవాళ రాజ్‌నాథ్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే రాహుల్ ట్విటర్లో స్పందిస్తూ రాజ్‌నాథ్ తీరును ఎండగట్టారు.

 ‘‘అది మీకు నిజంగా బాధకలిగిస్తే... మీ ట్వీట్‌లో చైనా పేరు చెప్పకుండా భారత ఆర్మీని ఎందుకు అవమానించారు? సంతాపం తెలిపేందుకు రెండు రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు? సైనికులు ఓ వైపు అమరులవుతుండగా... వర్చువల్ ర్యాలీల్లో ఎందుకు ప్రసంగాలు చేశారు? ఆశ్రిత మీడియాతో ఆర్మీని తిట్టిస్తూ ఎందుకు దాక్కున్నారు? పెయిడ్ మీడియాతో భారత ప్రభుత్వానికి బదులు ఆర్మీపై ఎందుకు నిందలు వేశారు’’ అని రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

కాగా రాజ్‌నాథ్ సింగ్ తన పోస్టులో చైనా పేరును ప్రస్తావించేందుకు ఎందుకు ‘‘భయపడ్డారంటూ’’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా సైతం ప్రశ్నలు సంధించారు. ‘‘చైనా పేరెత్తేందుకు ఎందుకంత భయం మన సైనికులు ఎంత మంది చనిపోయారు చైనా దళాలు మన సైనికులను అపహరించాయా తప్పుదోవ పట్టించొద్దు. దేశం ముందుకొచ్చి సమాధానం చెప్పండి..’’ అంటూ సుర్జేవాలా ప్రశ్నించారు. 

చైనాకి ఎంత ధైర్యం.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణల్లో భారత సైనికుల మృతి పట్ల ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని దశాబ్దాల తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లో ఇంత  దారుణ సంఘటన చోటుచేసుకున్నా ప్రధాని ‘‘మౌనం’’ దాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

‘‘ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నట్టు ఆయన ఎందుకు దాక్కుంటున్నారు అయ్యిందేదో అయ్యింది. అయితే అక్కడ ఏం జరిగిందో మాకు తెలియాలి. మన సైనికులను చంపడానికి చైనాకి ఎంత ధైర్యం మన భూమిపై అడుగుపెట్టడానికి వాళ్లెందుకు బరితెగించారు’’ అంటూ రాహుల్ ట్విటర్లో ప్రశ్నించారు. 

తూర్పు లద్దాక్‌లోని గాల్వాన్‌ లోయలో సోమవారం రాత్రి చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ కల్నల్ సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ప్రతిష్టంభన నెలకొన్న ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   14 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   7 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle