newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చైనా నుంచి కొత్త వైర‌స్.. ఏంటి దాని క‌థ‌..?

25-03-202025-03-2020 08:24:20 IST
Updated On 25-03-2020 08:24:41 ISTUpdated On 25-03-20202020-03-25T02:54:20.433Z25-03-2020 2020-03-25T02:54:12.635Z - 2020-03-25T02:54:41.060Z - 25-03-2020

చైనా నుంచి కొత్త వైర‌స్.. ఏంటి దాని క‌థ‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ పుట్టింది చైనాలో. క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే 195 దేశాల‌కు వ్యాపించి ప్ర‌పంచాన్నే అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌పంచ‌మే లాక్‌డౌన్ దిశ‌గా వెళుతోంది. ఈ వైర‌స్‌కు ఇంకా మందు కూడా క‌నిపెట్ట‌క‌ముందే చైనాలో మ‌రో వైర‌స్ మొద‌లు కావ‌డం ప్ర‌పంచవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. హంటా వైర‌స్ కార‌ణంగా బ‌స్సులోనే ఒక‌రు మ‌ర‌ణించార‌ని, బ‌స్సులో ఉన్న మ‌రో 32 మంది ప్ర‌యాణికుల‌కు వైద్య ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నార‌నే ఓ వార్త సంచ‌ల‌నంగా మారింది.

ఈ వార్త వ‌చ్చింది ఏదో ఆషామాషీ మీడియాలో కాదు. చైనాలోని బీజింగ్ కేంద్రంగా ప‌నిచేసే ఆ దేశంలోని అధికారిక మీడియా సంస్థ గ్లోబ‌ల్ టైమ్స్ ఈ వార్త‌ను ట్వీట్ చేసింది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు చైనాను తిట్టిపోస్తున్నాయి. అమెరికా అయితే క‌రోనాను చైనా వైర‌స్ అని ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తోంది. చైనానే ఈ వైర‌స్‌ను ప్ర‌పంచం పైకి వ‌దిలింద‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ప‌డిపోతున్నా చైనాలో మాత్రం లాభాల్లో ఉంటున్నాయి.

చైనాలో ఈ వైర‌స్ ఎంత వేగంగా విస్త‌రించిందో అంతే వేగంగా త‌గ్గిపోయింది. చైనాకు మిత్ర‌దేశాలుగా ఉన్న ఉత్త‌ర కొరియా వంటి దేశాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఈ అన్ని అంశాల వ‌ల్ల చైనాపై అనుమాన‌పు చూపులు మొద‌ల‌య్యాయి. చైనా ఆహార‌పు అల‌వాట్ల‌ను సైతం ప్ర‌పంచ దేశాలు నిందిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు. ఇంత‌లో హంటా వైర‌స్ కూడా మొద‌లైంద‌ని, ఒక‌రు మ‌ర‌ణించార‌నే వార్త‌తో మ‌రోసారి చైనాను తిట్టి పోస్తున్నారు.

ట్విట్ట‌ర్‌లో నిన్నంతా హంటా వైర‌స్ ట్రెండింగ్‌లో ఉంది. అంతా దీనిని చైనా నుంచి కొత్త వైర‌స్ వ‌స్తుంద‌నే చెబుతున్నారు. కానీ, హంటా వైర‌స్ కొత్త‌ది ఏమీ కాదు. ద‌శాబ్దాలుగా ఎక్క‌డో ఓ చోట మ‌నుషుల‌ను ఇబ్బంది పెడుతున్న‌దే. 1978లో సౌత్ కొరియాలోని హాంటాన్ న‌దీ తీర ప్రాంతంలో హంటా వైర‌స్ పుట్టింది. అందుకే ఈ న‌ది పేరు మీద‌నే ఈ వైర‌స్‌కు హంటా వైర‌స్ అనే పేరు వ‌చ్చింది. ఎలుక‌లు ద్వారా ఈ వైర‌స్ మ‌నుషుల‌కు సోకుతుంది. హంటా వైర‌స్ కార‌ణంగా హంటావైర‌స్ ప‌ల్మ‌నరీ సిండ్రోమ్‌(హెచ్పీఎస్‌) అనే వ్యాధి సోకుతుంది.

ఈ వైర‌స్ సోకిన ఎలుక‌ల‌ను, వాటి మ‌ల‌మూత్రాల‌ను, చొంగ‌ను మ‌నుషులు తాకి వారి ముఖాన్ని తాకితే ఈ వైర‌స్ మ‌నుషుల‌కు కూడా సోకే ప్ర‌మాదం ఉంది. ఈ వైర‌స్ బారిన ప‌డిన ఎలుక‌లు క‌రిస్తే కూడా మ‌నుషుల‌కు హంటా వైర‌స్ సోకుతుంది. 2012లో అమెరికాలోని కాలిఫోర్నియాలో 10 మందికి ఈ వైర‌స్ సోకింది. అంత‌కుముందు, ఆ త‌ర్వాత కూడా వివిద దేశాల్లో హంటా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదైన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. అయితే, క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న ఈ స‌మ‌యంలో హంటా వైర‌స్ కూడా మొద‌ల‌వ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది.

ఈ వైర‌స్ సోకిన వారిని గుర్తించాలంటే ఒక‌టి నుంచి ఐదు వారాల స‌మ‌యం ప‌డుతుంది. మొద‌ట్లో ఈ వైర‌స్ సోకిన వారికి జ్వ‌రం, కండ‌రాల నొప్పులు, అల‌స‌ట ఉండ‌టం ల‌క్ష‌ణాలుగా క‌నిపిస్తాయి. త‌ర్వాత క్ర‌మంగా ఊపిరి తీసుకోవ‌డానికి ఇబ్బంది క‌ల‌గ‌డం, త‌లనొప్పి, క‌డుపు నొప్పి, జ‌లుబు, వాంతులు, వికారం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి.

అయితే, హంటా వైర‌స్ మ‌న వ‌ద్ద‌కు రాలేదు. ఇప్పుడే వ‌చ్చే అవ‌కాశం కూడా లేదు. కాబట్టి, ఇప్ప‌టికైతే ఈ వైర‌స్ భ‌యం మ‌న‌కు లేద‌నే చెప్పాలి. ఈ వైర‌స్ వ‌స్తే సంభ‌వించే మ‌ర‌ణాల శాతం క‌రోనాతో పోల్చితే ఎక్కువ‌గా ఉంటుంది. కానీ, క‌రోనా వైర‌స్ అంత వేగంగా ఈ హంటా వైర‌స్ మ‌నుషుల‌కు వ్యాపించ‌ద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle