newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్.. డికె శివకుమార్‌

12-03-202012-03-2020 11:01:37 IST
Updated On 12-03-2020 11:09:33 ISTUpdated On 12-03-20202020-03-12T05:31:37.878Z12-03-2020 2020-03-12T05:31:32.791Z - 2020-03-12T05:39:33.264Z - 12-03-2020

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్.. డికె శివకుమార్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో కాంగ్రెస్‌ అధిష్టానంకు ఊహించిన పరిణామం ఎదురైంది. ఆ షాక్‌ నుంచి తేరుకున్న పార్టీ నాయకత్వం ఖాళీగా ఉన్న ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పదవులను వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌కు కీలక పదవి అప్పగించింది. ఆ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఆయన్ని నియమించింది. 

పార్టీలో సమర్థవంతమైన సీనియర్‌ నేతగా, వ్యూహకర్తగా డీకే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులుగా సలీమ్‌ అహ్మద్‌, ఈశ్వర్‌ ఖాంద్రీ, సతీష్‌ జర్కీహోళీలు పదవులు దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. అలాగే ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత అనిల్‌ చైదరీని పార్టీ అధిష్టానం నియమించింది. 

కాగా చాలా కాలం నుంచి పలు రాష్ట్రాల్లో పీసీసీ పదవులు ఖాళీగానే ఉంటున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో గుండూరావు రాజీనామా అనంతరం కొత్త నాయకత్వాన్ని నియమించడంపై అధిష్టానం ఆసక్తి కనబరచలేదు. తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఢిల్లీలకు నూతన పీసీసీలను నియమించింది.

కాగా మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ అధిష్టానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. 

బుధవారం 11 మందితో కూడిన తొలిజాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క రోజుకిందట కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సింధియాకు అవకాశం కల్పించింది. ఆయన స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ నుంచి పెద్దల సభకు ఎంపిక చేసింది. ఆయనతో పాటు 11 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది. అలాగే మిత్రపక్షాలకూ బీజేపీ అవకాశం కల్పించింది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle