newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌ని పూర్తి చేసిన బీజేపీ

07-07-201907-07-2019 09:06:05 IST
Updated On 08-07-2019 10:48:07 ISTUpdated On 08-07-20192019-07-07T03:36:05.351Z07-07-2019 2019-07-07T03:35:59.761Z - 2019-07-08T05:18:07.836Z - 08-07-2019

చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌ని పూర్తి చేసిన బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాట‌క‌లో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం ప‌త‌నానికి అత్యంత చేరువ‌లో ఉంది. సంవ‌త్స‌రం పాటు క‌ల‌హాల కాపురంలా సాగిన ప్ర‌భుత్వం కుప్ప‌కూలేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు కుమారస్వామిని గ‌ద్దె దించి క‌ర్ణాట‌క‌ను చేజిక్కించుకోవాల‌ని ఎదురుచూస్తున్న బీజేపీ చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌ని కానిచ్చేస్తోంది. 12 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డంతో సంకీర్ణ ప్ర‌భుత్వం తీవ్ర సంక్షోభంలో ప‌డింది.

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగ‌ర్ ద‌క్క‌లేదు. 224 సీట్లు ఉన్న అసెంబ్లీలో 105 సీట్లు ద‌క్కించుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కానీ, అసెంబ్లీలో బ‌లం నిరూపించుకోలేక‌పోవ‌డంతో మూడు రోజులకే ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప రాజీనామా చేశారు.

ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీకి రాష్ట్రంలో అధికారం ద‌క్క‌వ‌ద్ద‌ని కంక‌ణం క‌ట్టుకున్న కాంగ్రెస్ అప్పుడు ఎక్కువ‌గా సీట్లు ఉన్నా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకొని జేడీఎస్‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఎప్పుడు ప‌డిపోతుందా అనే అనుమానాలే ఉన్నాయి. అయితే, పార్ల‌మెంటు ఎన్నిక‌లు ముందున్నందున ప్రభుత్వం ప‌డిపోయే విధంగా బీజేపీ ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. పార్ల‌మెంటు ఎన్నిక‌లు అయిపోగానే రాజ‌కీయాలు వేగంగా మార‌తాయ‌ని, కర్ణాట‌క ప్ర‌భుత్వం కూల‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకున్న‌ట్లే ఇప్పుడు జ‌రుగుతోంది.

ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి అమెరికాలో, పీసీసీ అధ్య‌క్షుడు గుండూరావు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా స్వంత పార్టీల ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా స‌మ‌ర్పించారు. వీరిలో ఎక్కువ‌గా సీనియర్ ఎమ్మెల్యేలే ఉన్నారు.

వీరి రాజీనామాతో ప్ర‌భుత్వం కూలిపోయే ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు 80, జేడీఎస్ కు 37 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 12 మంది రాజీనామాతో కూట‌మి బ‌లం 105కి ప‌డిపోయింది. దీంతో ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం ఖాయ‌మే.

అయితే, ప్ర‌జ‌లు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేర‌ని బీజేపీ నేత య‌డ్యుర‌ప్ప చెబుతున్నారు. రాష్ట్రంలో ప‌రిణామాల‌తో త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం ప‌డిపోతే తాము ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ఆయన ఇప్ప‌టికే చెప్పారు.

ఒక‌వేళ వీరి రాజీనామాలు ఆమోదం పొంది బీజేపీని బ‌లం నిరూపించుకునేందుకు గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇస్తే.. స‌భ‌లో ఉన్న స‌భ్యుల సంఖ్య‌లో స‌గానికి ఎక్కువ బీజేపీకి ఎక్కువ ఉంటారు కాబ‌ట్టి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

ఇంత‌లో న‌లుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. సిద్ధ‌రామ‌య్యను ముఖ్య‌మంత్రిని చేస్తామంటే తాము త‌మ రాజీనామాల‌ను ఉప‌సంహ‌రించుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని బీజేపీ ఎక్క‌డా చేతికి మ‌ట్టి అంట‌కుండా జ‌రుపుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవ‌రూ స‌రైన కార‌ణం చూప‌డం లేదు. బీజేపీ ఆప‌రేషన్ లోట‌స్‌లో భాగంగానే ఇదంతా చేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌, జేడీఎస్ మాత్రం త‌మ ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు చివ‌రి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

కాంగ్రెస్ ట్ర‌బుల్‌షూట‌ర్‌గా గుర్తింపు పొందిన డీకే శివ‌కుమార్‌, రాష్ట్ర పార్టీ ఇంఛార్జి వేణుగోపాల్ ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గిస్తున్నారు. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌తో కుమార‌స్వామి, గుండూరావు వెంట‌నే విదేశాల నుంచి క‌ర్ణాట‌క బ‌య‌లుదేరారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle