చివరి దశకు కర్ణాటక ఎపిసోడ్.. కుమారస్వామి రాజీనామా?
11-07-201911-07-2019 09:48:06 IST
Updated On 11-07-2019 11:22:30 ISTUpdated On 11-07-20192019-07-11T04:18:06.393Z11-07-2019 2019-07-11T04:17:37.124Z - 2019-07-11T05:52:30.918Z - 11-07-2019

తీవ్ర ఉత్కంఠగా మారిన కర్నాటక రాజకీయాలు చివరి అంకానికి చేరాయి. ఈనేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ను కలిసి గురువారమే రాజీనామా చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే బయట నుంచి మద్దతిచ్చే యోచనలో ఉన్నారు కుమారస్వామి. బుధవారం సాయంత్రం నుంచి శరవేగంగా మారిన పరిణామాలతో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యవసంరగా కేబినెట్ భేటీ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ సందర్భంగానే ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు మొత్తం అసెంబ్లీనే రద్దు చేయాలన్న ప్రతిపాదనను గవర్నర్‌కు అందచేయనున్నట్లు సమాచారం. కర్ణాటకలో అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో బుధవారం కుమారస్వామి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లి కొన్ని గంటల పాటు రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. తర్వాత జేపీ నగర్‌లోని తన సొంతింటికి చేరుకున్నారు. తాజా పరిణామాలపై తన తండ్రి దేవెగౌడతో చర్చించారు. ఆయన సలహా మేరకే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారు. బుధవారం జరిగిన పరిణామాలు కుమారస్వామిని తీవ్ర వేదనకు గురిచేశాయి. ఈ సంక్షోభానికి కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్న ప్రచారం ఆదినుంచి జరుగుతోంది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య ఆడుతున్న మైండ్‌గేమ్‌లో కుమారస్వామి చిక్కుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే బయటి నుంచి మద్దతివ్వాలని జేడీఎస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత యడ్యూరప్న పావులు కదుపుతున్నారు. గవర్నర్ ని కలిసి కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్పీకర్ నిర్ణయం, సుప్రీంకోర్టులో కేసు, గవర్నర్ జోక్యంతో కర్నాటక ఎపిసోడ్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా