చివరి అంకానికి కన్నడ రాజకీయం.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ!
17-07-201917-07-2019 09:03:48 IST
Updated On 17-07-2019 12:13:53 ISTUpdated On 17-07-20192019-07-17T03:33:48.472Z17-07-2019 2019-07-17T03:31:31.243Z - 2019-07-17T06:43:53.486Z - 17-07-2019

కన్నడ సంకీర్ణ సర్కార్ మనుగడ ప్రశ్నార్థకమయిన వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది. గత కొద్ది రోజులుగా సస్పెన్స్ గా ఉన్న కన్నడ రాజకీయం సుప్రీంకోర్టులో తుది అంకానికి చేరుకుంది. ఎమ్మెల్మేల రాజీనామా వ్యవహారం ఇవాళ తుదిదశకు చేరనుంది. దీంతో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడనుంది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ రమేష్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పెట్టుకున్న అర్జీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ద బోస్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింది. రెబెల్స్ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ, సీఎం కుమారస్వామి తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్, స్పీకర్ తరపున ఏఎం సింఘ్వీ తమ వాదనలు వినిపించారు. రెబెల్ ఎమ్మెల్యేల పక్షాన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అసెంబ్లీ సమావేశాల హాజరు నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను మినహాయించాలని, ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందున సంకీర్ణ ప్రభుత్వం విప్ చెల్లదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికే స్పీకర్ వారి రాజీనామా విషయాన్ని జాప్యం చేస్తున్నారని, అనర్హతను తప్పించుకునేందుకు రాజీనామా చేయడంలో వారి తప్పేమీ లేదని రోహత్గీ తెలిపారు. ఇదిలా ఉంటే స్పీకర్ తరఫు న్యాయవాది ...గడువులోగా ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలంటూ స్పీకర్‌పై ఒత్తిడి తేలేరన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల ప్రక్రియ సరిగాలేదన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, అందుకే వారి వినతిని పట్టించుకోవద్దని కోరారు. స్పీకర్ తరఫు న్యాయవాది సింఘ్వీ వాదిస్తూ.. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వుల్లో న్యాయస్థానం మార్పులు చేస్తే బుధవారం కల్లా స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని సింఘ్వి అన్నారు. మూడు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. గురువారం కుమారస్వామి సర్కార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
a day ago
ఇంకా